
ప్రపంచవ్యాప్తంగా 6,000 పంటజాతులు సాగు చేయబడుతున్నప్పటికీ, ఆహార ఉత్పత్తిలో 60 శాతం కేవలం తొమ్మిది పంటలపైనే ఆధారపడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (FAO) తాజా నివేదిక వెల్లడించింది. ఈ తొమ్మిది ప్రధాన పంటలు చెఱకు, మొక్కజొన్న, బియ్యం, గోధుమ, బంగాళదుంప, సోయాబీన్, ఆయిల్ పామ్, షుగర్ బీట్, కర్ర పెండలం.
పంట వైవిధ్యం ప్రమాదంలో
FAO విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పంటల జాతి వైవిధ్యం క్షీణిస్తున్నది. 128 దేశాలు, 17 అంతర్జాతీయ సంస్థలు అందించిన సమాచారంతో ఈ అధ్యయనం కీలకమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది.
- ఈ పరిశోధన చేసిన 18 ప్రాంతాలలోని తొమ్మిది స్థానాల్లో పంటల వైవిద్యం 18 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంది.
- దక్షిణ ఆఫ్రికాలో అత్యధికంగా పంట వైవిధ్యం ప్రమాదంలో ఉండగా, ఆ తరువాత కరేబియన్, పశ్చిమ ఆసియా దేశాల్లో ఈ స్థితి ఉంది.
- భారతదేశంలోనూ పంటల పరిరక్షణ అత్యవసరంగా మారింది. ఐదు ప్రధాన వ్యవసాయ ప్రాంతాల్లో 50 శాతం కంటే ఎక్కువ రకాల విత్తనాలు ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు.
భారత నూతన విత్తన కేంద్రాల ప్రాధాన్యం
భారత ప్రభుత్వం 2016లో ప్రారంభించిన ‘సీడ్ హబ్’ పథకం ద్వారా దేశీయ పప్పుధాన్య ఉత్పత్తి పెరిగింది.
- 2007-08లో 14.76 మిలియన్ టన్నులుగా ఉన్న పప్పుధాన్య ఉత్పత్తి, 2020-21 నాటికి 24.42 మిలియన్ టన్నులకు చేరింది.
- ఇది చిన్న రైతులకు అధిక దిగుబడి కలిగిన విత్తనాలను అందించడంలో కీలకపాత్ర వహించింది.
వాతావరణ మార్పులు – పంట భద్రతకు ముప్పు
వాతావరణ మార్పులు, అనూహ్యమైన వర్షాలు, కరువుల ప్రభావం పంట వైవిధ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. FAO నివేదిక ప్రకారం, పంటల వైవిధ్య నష్టంపై ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోలేక పోతుంది. అధిక వర్షపాతం లేదా పొడి వాతావరణం వల్ల జరిగిన నష్టాన్ని ఆర్థిక దృష్టికోణంలో మాత్రమే అంచనా వేయడం, పంట జాతుల గురించి పరిగణించకపోవడం పెద్ద సమస్యగా మారింది.
తరువాత ఏమి చేయాలి?
FAO నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా విత్తన బ్యాంకుల ఏర్పాటు, రైతులకు స్థానిక విత్తన భద్రతను కల్పించే విధానాలను తీసుకురావడం అత్యవసరం. లేదంటే, భవిష్యత్తులో పంటల ఉత్పత్తి కొన్ని పంటలపైనే ఆధారపడే ప్రమాదం ఉంది.
Share your comments