
ఉల్లిగడ్డలు భారతదేశంలో ప్రాధాన్యమైన వాణిజ్య పంటల్లో ఒకటి. ప్రపంచంలోనే ఉల్లిపాయల ఉత్పత్తి లో రెండవ స్థానం లో భారత్ ఉంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉల్లిగడ్డల సాగు విస్తృతంగా జరుగుతుంది. ఇవి విరివిగా వంటకాలలో ఉపయోగించబడటంతో పాటు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ కలిగి ఉన్నాయి. అయితే ఉల్లిగడ్డలలో చాలా రకాలు ఉంటాయి, వాటిలో అధిక దిగుబడి ఇచ్చేవి ఏవి?, వాటిని ఎలా వాడాలి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
ఉల్లిగడ్డల సాగు రైతులకు మంచి ఆదాయాన్ని అందించగలదు. ఉల్లిపాయలు ముఖ్యంగా రబీ సీజన్‌లో ఎక్కువగా సాగు చేయబడతాయి, కానీ కొద్ది మార్పులతో ఖరీఫ్ లో కూడా ఈ పంటని వెయ్యవచ్చు. మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉండే కాలాల్లో నాణ్యమైన ఉత్పత్తిని అందించగలిగితే, రైతులు ఎక్కువ లాభాలు పొందగలరు.
అధిక దిగుబడి ఇచ్చే ఉల్లి రకాలు
పరిశోధన అధ్యయనాల ప్రకారం, భారతదేశంలో ఉల్లిగడ్డల ఉత్పత్తికి సంబంధించి వివిధ వేరైటీలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన వేరైటీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి.
NHRDF Red-3
- లక్షణాలు: లైట్ బ్రోన్జ్ రంగు, గుండ్రని ఆకారం.
- దిగుబడి: 347.65 క్వింటాళ్లు/హెక్టారు .
- సమయం: 125 రోజులు.
- ప్రయోజనాలు: అధిక ఉత్పత్తి, మృదువైన చర్మం, ఎక్కువ రోజులు నిల్వ ఉండగలవు .
NHRDF Red-4
- లక్షణాలు: డార్క్ రెడ్ రంగు, గుండ్రని ఆకారం.
- దిగుబడి: 307.16 క్వింటాళ్లు/హెక్టారు .
- సమయం: 118 రోజులు.
- ప్రయోజనాలు: మంచి నిల్వ సామర్థ్యం, అధిక దిగుబడి.
అగ్రిఫౌండ్ లేత ఎరుపు రకం (Agrifound Light Red)
- లక్షణాలు: లైట్ రెడ్ రంగు, గుండ్రని ఆకారం.
- దిగుబడి: 245.74 క్వింటాళ్లు/హెక్టారు .
- సమయం: 116 రోజులు.
- ప్రయోజనాలు: మంచి రుచితో పాటు అధిక ధర.
సుఖ్ సాగర్
- లక్షణాలు: డార్క్ రెడ్ రంగు, గుండ్రని ఆకారం.
- దిగుబడి: 206.24 క్వింటాళ్లు/హెక్టారు .
- సమయం: 98 రోజులు.
- ప్రయోజనాలు: తక్కువ కాలంలో ఉత్పత్తి, వ్యవసాయ వ్యయాలు తక్కువ.
ఉత్తమ ఉల్లిగడ్డ వేరైటీల ఎంపికలో ముఖ్య అంశాలు
- స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేరైటీల ఎంపిక.
- ఉత్పత్తి సామర్థ్యం మరియు నిల్వ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం.
- వ్యాధి నిరోధకత కలిగిన విత్తనాలను ప్రాధాన్యత ఇవ్వడం.
మట్టిని తయారు చేయడం
ఉల్లిగడ్డలు ఎక్కువగా ఒలిగిన ఇసుక మట్టిలో (Loamy Soil) బాగా పెరుగుతాయి.
- pH స్థాయి – 6.5-7.5 మధ్య ఉండాలి
- సేంద్రీయ ఎరువులు – ఎక్కువగా ఉపయోగించడం వల్ల మట్టి నాణ్యత మెరుగవుతుంది.
- విత్తే ముందు నేలకు FYM (Farm Yard Manure), గోరింటాకు, బోన్ మీల్ కలిపి మట్టిని తయారు చేయాలి.
నీటి యాజమాన్యం
- ఉల్లిగడ్డల సాగులో ఎక్కువ నీరు అవసరం లేదు.
- డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని సమర్థవంతంగా వినియోగించవచ్చు.
- పంట ఆఖరి దశలో మాత్రం నీటి ఎద్దడి బాగా చూసుకోవాలి.
ఉల్లిగడ్డ సాగుకు అనువైన భూభాగం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ఉల్లిగడ్డల సాగుకు అత్యంత అనువైనవిగా గుర్తించబడ్డాయి.
- రాయలసీమ ప్రాంతం – కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు
- కృష్ణా - గోదావరి ప్రాంతాలు – గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి
- తెలంగాణలో – మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, నల్గొండ
ఈ ప్రాంతాల్లోని మట్టి తక్కువ తేమను కలిగి ఉండటంతో ఉల్లిగడ్డల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది.
Share your comments