ఖరీఫ్ పంట సాగు మొదలు పెట్టడానికి రైతులు అందరు పొలాలను సిద్ధం చేసే కాలం ఇది. అయితే ఖరీఫ్ పంట విత్తడానికి ముందు,
వేసవి దుక్కులు చేయడం ద్వారా, పంట పెట్టుబడులు తగ్గించి మంచి దిగుబడులు పొందవచ్చు.
పంట నష్టం కలగడానికి రెండు ముఖ్యమైన కారణాలు చీడపీడలు ,లేదా కలుపు మొక్కలు. వీటిని నివారించడానికి పురుగుమందులు అయ్యే ఖర్చు రైతుకు నష్టం. కానీ దీనికొక పరిష్కారం ఉంది
ఎండాకాలంలో భూమిని లోతు దుక్కులు దున్నడం వల్ల పెద్ద పెద్ద మట్టి గడ్డలు తలకిందులుగా పడతాయి.అప్పుడు భూమి లోపల ఉండే చీడపీడలు సూర్యరశ్మి బారిన పడి నాశనం అవుతాయి.పురుగులకు ( Worm )సంబంధించిన గుడ్లు పూర్తిగా నివారించబడతాయి.పైగా కలుపు విత్తనాలు కూడా నాశనం అవుతాయి.వేసవి దిక్కులకు భూమి మెత్తగా అవుతుంది.
వ్యవసాయ రంగంలో అధిక దిగుబడి( High yield ) సాధించాలంటే చీడ పీడల పెడతను పూర్తిగా నివారించడంతోపాటు కలుపు సమస్యలు లేకుండా ఉండాలని అందరికీ తెలిసిందే.ఈ రెండు సమస్యలకు వేసవి దుక్కుల ద్వారా దాదాపుగా చెక్ పెట్టినట్టే.
అంతేకాదు లోతు దుక్కులు దున్నిన భూమిలో తొలకరి వర్షాలు పడితే నీరు లోపలికి ఇంకిపోతుంది.అప్పుడు భూమి ఎక్కువ రోజులు తేమను నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
పంట వేశాక వర్షాలు పడడం కాస్త ఆలస్యం అయినా భూమిలో తేమ ఉండడం వల్ల పంటకు ఎటువంటి బెట్ట అనేది ఉండదు.కాబట్టి వేసవిలో లోతు దుక్కులు దున్ని పొలాన్ని సిద్ధంగా ఉంచుకుంటే తొలకరి చినుకులు కోరిసిన తర్వాత గోర్రుతో సేద్యం చేయాలి. గొర్రుతో సేద్యం చేసే మొక్క యొక్క వేర్లు భూమిలో విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది.
గొర్రు, గుంటక లాంటి పరికరాల సహాయంతో భూమిని మూడు నుంచి 6 అంగుళాల లోతు వరకు సేద్యం చేయాలి.
అప్పుడు భూమి లోపల ఐదు నుంచి 6 అంగుళాల మధ్యలో ఒక పొరలాంటిది ఏర్పడుతుంది.అప్పుడు నేల అధికంగా నీటిని పీల్చుకునే శక్తిని కోల్పోతుంది.కావున వేసవి దుక్కులు లోతుగా దున్నితే ఈ గట్టి పొర పోయి నేలకు నీటిని పీల్చుకునే శక్తి అధికం అవుతుంది.
ఈ రకం గా సాగుకు ముందు పంట మట్టిని సిద్ధం చేయడం వల్ల పంట లో కలిగే నష్టాలని చాల మేరకు తగ్గించవచ్చు. మట్టి నాణ్యత పరీక్ష, సరైన పోషకాల సిఫారసు కోసం దగ్గరలోని వ్యవసాయ కేంద్ర నిపుణులను సంప్రదించి దాని ప్రకారం సాగు మొదలుపెట్టడం మంచిది.
ఇది కూడా చదవండి
Share your comments