కోట్ల ఆదాయం ఇచ్చే సాగు అనగానే టేకు, కలప ఏ గుర్తొస్తుంది అందరికి .దానికున్న ప్రత్యేకత డిమాండ్ అలాటిది మరి . ఆగ్రో ఫారెస్ట్రీ లేదా తోటల వ్యవసాయం చేసే రైతులకు టేకు, కలప యొక్క ప్రాముఖ్యత ఎంతో తెలిసే ఉంటుంది. ఐటితే టేకు కుటుంబానికి చెందిన ఇంకో చెట్టు ఇంకా తక్కువ కలం లో ఎక్కువ లాభాలను అందిస్తుంది- అదే “మహోగని”
మహోగని ప్రపంచంలో అతి వేగంగా పెరిగే మరియు ఫర్నిచర్ (Furniture) రంగంలో అత్యంత ఎక్కువగా వాడే వేప కుటుంబానికి చెందిన ఒక అద్భుతమైన వృక్షం,ఈ చెట్టు కేవలం 10 నుండి 12 సంవత్సరాలలో సంపూర్ణంగా పెరిగి వాడటానికి తయారవుతుంది. ఇది ఎరుపు రంగులో ఉండే మరియు టేక్ (Teak Wood) కి ఏకైక పర్యాయ కలపగా పేరొందింది. మన తెలుగు రాష్ట్ర రైతు సోదరులకు మహోగని వ్యవసాయం అతి సులభంగా, అతి తక్కువ ఖర్చుతో 12 సంవత్సరాలకు కోటి రూపాయల పైబడి ఆదాయాన్నిచ్చే కల్ప వృక్షం. మహోగని కలప దాని అందం, రంగు, పని సామర్థ్యం, గట్టితనం, మన్నిక మరియు స్థిరత్వం వలన వాణిజ్యపరంగా అత్యంత విలువైనది.
మహూగాని సాగు చేస్తున్న రైతులకు, కలప తయారయ్యాక, విక్రయిస్తే, పెట్టు బడి ఖర్చులు పోను, ఎకరాకు సుమారు ఒక కోటి ఇరవై లక్షల లాభం అందుతుంది. కాబట్టి మహూగాని సాగు మిగతా అగ్రోఫారెస్ట్రీ పంటల సాగు కన్నా ఎంతో లాభదాయకంగా ఉందని ఎందరో రైతులు చెప్తున్నారు.
ఈ భూమి మీద ప్రతి చెట్టుకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మహోగని చెట్టు చాలా విభిన్నంగా ఉంది. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు మరియు పండ్లని (SKY FRUIT) ఆగ్రోఫారెస్ట్రీ విభాగం లో మధుమేహం, రక్తహీనత, క్యాన్సర్, డైయేరియా, మలేరియా మరియు ఇతర వ్యాధులలో ఔషధ ప్రయోజనాలకు అత్యంత ఎక్కువగా ఉపయోగిస్తారు.
మహోగని చెట్టు మానవజాతిననే కాక పర్యావరణాన్ని రక్షించడానికి పలు విధాలుగా సాయపడతాయి. ఎందుకంటే వాతావరణం వల్ల కలిగే వ్యాధుల ప్రమాదాల్ని తగ్గించడంలో సహాయపడతాయి. మరియు గ్లోబల్ వార్మింగ్ మరియు దాని ప్రభావాలను కూడా తగ్గిస్తాయి. మహోగని చెట్టు సల్ఫర్ సమ్మేళనాన్ని విడుదలచేస్తాయి.
ఇవి గ్రీన్ హౌస్ వాయువులద్వారా వాతావరణం వేడెక్కడాన్ని తగ్గించగలవు, ఇవి భూగర్భ జలస్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. నేలకోతను నిరోధిస్తాయి. మరియు తారు రోడ్లపైన ప్రభావాన్ని చూపుతాయి. మహోగని చెట్టు మొత్తానికి పర్యావరణ వ్యవస్థకు పెద్ద స్థాయిలో దోహదపడతాయి. ఇవి తమ సమీప ప్రాంతంలో మరియు చుట్టుప్రక్కల పెరుగుతున్న ఇతర మొక్కలకు మరియు పంటలకు పరోక్షంగా సహాయపడుతాయి.
ఇది కూడా చదవండి
Share your comments