Agripedia

దొండ పంట లో వేరు కుళ్ళు ,వెర్రి తెగులు నివారణ, యాజమాన్య చర్యలు

Sriya Patnala
Sriya Patnala
Prevention and management of root rot and verri pest in Ivygaurd (Donda crop)
Prevention and management of root rot and verri pest in Ivygaurd (Donda crop)

దొండకాయ , మనం రోజు వాడే కూరగాయల్లో ఒకటి. దొండలో విటమిన్లు, ఐరన్, కాల్షియం పాటు పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి.
కాబట్టి మార్కెట్ లో కూడా ఈ కూరగాయ కు మంచి డిమాండ్ ఉంటుంది. సాగు కూడా తక్కువ ఖర్చు సులభం. ఒక్కసారి దొండ పంట నాటుకుంటే మూడు సంవత్సరాల వరకు పంట దిగుబడి పొందవచ్చు

మాములు పద్ధతిలో కాకుండా పందిరి విధానం లో దొండ పంట సాగు చేయడం ద్వారా , అత్యధిక దిగుబడులు పొందవచ్చు. దొంత పంట ను సంవత్సరం లో ఏ నెలలోనైనా నాటుకోవచ్చు. నీరు, ఎండా సరిపడా ఉండేలా చూస్కుంటే సరిపోతుంది.

మురుగునీరు పోయే వసతి కలిగిన నేలలు, పొడి వాతావరణం దొండ సాగుకు అనుకూలంగా ఉంటాయి.ఒక ఎకరానికి 2000 కాండం ముక్కలను నాటుకోవాలి.

పొలంలో నాటుకునే ముందు ఈ కాండం ముక్కలను మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్( Copper oxychloride ) ద్రావణంలో కాసేపు ముంచి, తరువాత నాటుకోవాలి.

ఇది కూడా చదవండి

నీలం రంగు పసుపుకి మార్కెట్ లో సూపర్ డిమాండ్ (Blue gold)

పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి.నేల యొక్క స్వభావాన్ని బట్టి వారానికి ఒకసారి నీటి తడులు అందించాలి.ఇక దొండ సాగుకు చీడపీడల బెడద, తెగుళ్ల బెడద కాస్త అధికంగానే ఉంటుంది.

దొండ నాటిన 60 రోజుల తర్వాత పూత రావడం ప్రారంభం అవుతుంది.అప్పటినుండి పంటను జాగ్రత్తగా సంరక్షించుకోవాలి.

వేరు కుళ్ళు తెగులు, వెర్రి తెగులు పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.ఈ తెగుల వల్ల మొక్క కాండం పూర్తిగా కుళ్ళిపోతుంది.కాబట్టి వెంటనే ఒక లీటరు నీటిలో రెండు గ్రాముల మెటాలాక్సిల్ ( Metalaxyl )కలిపి నేల బాగా తడిచేలాగా పొలంలో పోయాలి.

ఇక బెర్రీ తెగులు ఆశించిన మొక్కల యొక్క ఆకులు సార్లతో నిండి, పూత, పిందెలు గిడస బారి పోతాయి.ఈ తెగులు సోకిన మొక్కలను వెంటనే పంట నుండి వేరు చేసి నాశనం చేయాలి

తరువాత లీటర్ నీటిలో రెండు మిల్లీలీటర్ల డైమిధోయెట్ ను కలిపి పంటకు పిచికారి చేయాలి.ఈ రెండు తెగులను సకాలంలో గుర్తించి నివారించకపోతే రైతులు పంటలో తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి

నీలం రంగు పసుపుకి మార్కెట్ లో సూపర్ డిమాండ్ (Blue gold)

Share your comments

Subscribe Magazine