Agripedia

వ్యవసాయ మార్కెటింగ్ అంటే ఏంటి? రైతులకు తెలిసి ఉండాల్సిన అన్ని విషయాలు ఒక్కచోటే!

Sandilya Sharma
Sandilya Sharma
How Farmers Sell Crops in India - Agricultural Market Reforms in India
How Farmers Sell Crops in India - Agricultural Market Reforms in India

వ్యవసాయ మార్కెటింగ్’ అంటే ఏంటి? (What is Agriculture Marketing in India)

భారతదేశంలో వ్యవసాయం చాలా కాలంగా ఒక జీవనాధార కొనసాగుతోంది. ఆరోజుల్లో రైతు పండించిన పంటలో కొంత భాగం తానూ  వాడుకుంటూ, మిగతాది గ్రామంలోనే తక్కువ ధరకు అమ్మేసేవాడు. అయితే ఇప్పుడు పలు కారణాల వల్ల తనకు సరైన ధర రావట్లేదు. అందుకే మార్కెటింగ్ వ్యవస్థ చాలా ముఖ్యం.

మార్కెటింగ్ అవసరమయ్యే కారణాలు (Market Benefits for Farmers)

దేశవ్యాప్తంగా ఆహార పంపిణీ కోసం, పరిశ్రమలకు ముడి పదార్థాల సరఫరా కోసం, రైతుకు గిట్టుబాటు ధర రావడానికి, నిల్వ, రవాణా, గ్రేడింగ్, సమాచార వసతుల కోసం ఇలా మొత్తానికి, రైతు ఉత్పత్తిని సరైన స్థలానికి, సరైన ధరకు చేర్చడం వ్యవసాయ మార్కెటింగ్ ముఖ్య ఉద్దేశం.

మార్కెటింగ్ రకాలు (Types of Agricultural Markets in Telugu)

  • ప్రాథమిక మార్కెట్లు (Village Level Markets): గ్రామాల్లో వారానికి ఒకసారి జరిగే సంతలే ఇవి (Village Weekly Markets for Farmers). ఇక్కడే సుమారు 50% పంటలు అమ్ముడవుతాయి. ఉత్తరాదిన వీటిని ‘బజార్‌లు’, ‘హాట్‌లు’, దక్షిణాదిలో ‘షాండీలు’ అంటారు.

 

  • ద్వితీయ మార్కెట్లు (Mandi/Town Markets): గ్రామాల్లోని ఉత్పత్తులు టోకు రూపంలో చిన్న పట్టణాల్లో విక్రయమవుతాయి. ఇక్కడ నిల్వ, బ్యాంకింగ్ వసతులు కూడా లభిస్తాయి.

 

  • అంతిమ మార్కెట్లు (Urban/Metro Markets): పెద్ద నగరాల్లో ఉండే ఇవి రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా ఉత్పత్తి వినియోగానికి ఉపయోగపడతాయి.

 

  • సంతలు (Seasonal Markets): యాత్రా స్థలాల్లో, పండుగల సందర్భంగా ఏర్పడే ఇవి పండ్లు, కూరగాయలు, పశువుల అమ్మకానికి వినియోగిస్తారు.

 

  • క్రమబద్ధ మార్కెట్లు (Regulated Markets): రైతు మోసపోకుండా, ధరల్లో పారదర్శకత ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవి.

 

  • సహకార మార్కెట్లు (Cooperative Markets): రైతులే కలిసి ఏర్పరచుకున్న మార్కెట్లు. ఇవే వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలకు సరైన పరిష్కారం (Problems in Agri Marketing India).

 

  • డిజిటల్ మార్కెట్ & ఈ-నామ్ (e-NAM): "21వ శతాబ్దంలోకి అడుగుపెట్టిన మన వ్యవసాయ మార్కెట్ కూడా ఇప్పుడు డిజిటల్ మార్గాల్లోకి వస్తోంది. e-NAM (National Agriculture Market) అనే ప్లాట్‌ఫామ్ ద్వారా రైతులు దేశవ్యాప్తంగా తమ పంటను విక్రయించుకునే సదుపాయం పొందుతున్నారు.

ఈ-నామ్ 2.0 ద్వారా.. ఫామ్ గేట్ మాడ్యూల్, FPOల మద్దతు, లాజిస్టిక్స్ సేవలు, డిజిటల్ సాంకేతికత వంటి సహకారాలు పొందవచ్చు. ఇవన్నీ రైతును మధ్యవర్తుల నుండి తప్పించుతూ, నేరుగా కొనుగోలుదారుడికి చేరేలా చేస్తాయి (eNAM for Farmers in India).

ఇవీ రైతుకు మార్కెటింగ్‌లో ఉన్న అవకాశాలు, సవాళ్లు, మరియు ప్రభుత్వ చర్యలు. మీరు రైతు అయితే తప్పక ఈ విధానాలను అర్థం చేసుకొని వాడుకోండి. 

Read More:

రూ. 400 కోట్ల విలువైన పేడ! మన పూర్వీకుల పద్ధతులు ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ట్రెండ్‌

2025 బ్రిక్స్ వ్యవసాయ సమావేశంలో భారత్ కీలక పాత్ర: చిన్న రైతుల సంక్షేమానికి మద్దతు

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More