
భారతదేశంలో పాడిపరిశ్రమ అభివృద్ధి, రైతుల ఆదాయ పెంపు, పాల ఉత్పత్తి పెంపు, స్వయం సమృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది (National Digital Livestock Mission). ఇందులో రాష్ట్రీయ గోకుల్ మిషన్, జాతీయ పాడి పశువుల అభివృద్ధి ప్రోగ్రాం (NPDD), జంతు ఆరోగ్య నియంత్రణ కార్యక్రమం, జాతీయ డిజిటల్ పశుసంవర్ధక మిషన్ (NDLM) వంటి పథకాలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి (Indian Dairy Development)
- 2014-15లో 146.31 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి
- 2023-24 నాటికి 239.3 మిలియన్ టన్నులకు పెరుగుదల (63.5% వృద్ధి)
- ఒడిశాలో 2014-15లో 18.98 లక్షల టన్నుల నుంచి 2023-24 నాటికి 26.30 లక్షల టన్నులకు (39% వృద్ధి)
రాష్ట్రీయ గోకుల్ మిషన్
దేశీయ గోధన జాతుల అభివృద్ధి, పాల ఉత్పత్తి పెంపు, రైతుల ఆదాయ వృద్ధికి ఈ పథకం ఉద్దేశించబడింది.
- జాతి మెరుగుదల కోసం దేశవ్యాప్త కృత్రిమ గర్భధారణ ప్రోగ్రాం
- ఒడిశాలో 46.53 లక్షల పశువులకు గర్భధారణ సదుపాయం, 61.10 లక్షల కృత్రిమ గర్భధారణలు
- 29.48 లక్షల రైతులకు లబ్ధి
- ఒడిశాలో 46.53 లక్షల పశువులకు గర్భధారణ సదుపాయం, 61.10 లక్షల కృత్రిమ గర్భధారణలు
- లింగ నిర్ధారిత వీర్యం (Sex-Sorted Semen Technology) – 90% స్త్రీ పశువులను ఉత్పత్తి చేసేలా జాతి మెరుగుదల
- ఒక డోస్ ఖర్చు రూ. 800 నుండి రూ. 250కి తగ్గింపు
- ఒడిశాలో 1.24 లక్షల డోసులు పంపిణీ, 38,398 మంది రైతులకు లబ్ధి
- ఒక డోస్ ఖర్చు రూ. 800 నుండి రూ. 250కి తగ్గింపు
- మైత్రి (MAITRI) పథకం – గ్రామీణ ప్రాంతాల్లో 1,500 మంది MAITRI సిబ్బందికి శిక్షణ
- IVF టెక్నాలజీ వినియోగం – దేశీయ జాతుల సంరక్షణ
- రైతులకు ఒక్కో IVF గర్భధారణకు రూ. 5,000 ప్రోత్సాహకం
- రైతులకు ఒక్కో IVF గర్భధారణకు రూ. 5,000 ప్రోత్సాహకం
- సేమెన్ స్టేషన్ల అభివృద్ధి – ఒడిశాలో కటక్‌లోని స్టేషన్‌కు నిధుల మంజూరు
- రైతుల శిక్షణ, అవగాహన శిబిరాలు
- 1,500 శిబిరాలు, 75,000 మంది రైతులకు శిక్షణ

జాతీయ పాడి అభివృద్ధి ప్రోగ్రాం (NPDD)
- పాల పరీక్షా కేంద్రాలు, చల్లబరిచే కేంద్రాల అభివృద్ధికి మద్దతు
- గత మూడు సంవత్సరాల్లో ఒడిశాకు రూ. 1591.08 లక్షల నిధులు విడుదల
జంతు ఆరోగ్య నియంత్రణ కార్యక్రమం
- గిట్టలు మరియు నోటి వ్యాధులు (Foot and Mouth Disease), బ్రుసెల్లోసిస్ (Brucellosis) లాంటి వ్యాధుల నివారణ
- కదిలే పశువుల ఆసుపత్రి (Mobile Veterinary Units) ఏర్పాటు – రైతుల ఇంటివద్దే సేవలు అందించేందుకు
జాతీయ డిజిటల్ పశుసంవర్ధక మిషన్ (NDLM)
- భారత్ పశుదాన్ (Bharat Pashudhan) డేటాబేస్ – 12-అంకెల ప్రత్యేక ట్యాగ్ ID ద్వారా లైవ్‌స్టాక్ రిజిస్ట్రేషన్
- ఒడిశాలో 1.65 కోట్ల జంతువులు డేటాబేస్‌లో నమోదు
- API ఆధారిత ఓపెన్ సోర్స్ వ్యవస్థ ద్వారా అన్ని సంస్థలు కనెక్ట్
భారతీయ పాడి ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహం
- APEDA, EIC ద్వారా ఎగుమతులకు ప్రమాణీకరణ
- వివిధ దేశాలతో Joint Working Groups, Technical Committees ద్వారా ఎగుమతులకు అవకాశాల విస్తరణ
ఈవిధంగా భారత పశువుల ఆరోగ్య రక్షణా కార్యక్రమాలు (Animal Health Program India) చేపట్టడం వల్ల పాల ఉత్పత్తి పెరిగి, భారత పాల ఎగుమతులు కూడా పెరుగుతాయి (Indian Dairy Export Promotion). మైత్రి కార్యక్రమం (MAITRI Training Program), కృత్రిమ గర్భధారణా వంటి పద్దతుల ద్వారా (Artificial Insemination for Cattle), మెరుగైన పాడిపశువుల అభివృద్ధి జరిగి రైతులకి మీలు జరుగుతుంది.
Read More:
Share your comments