
తెలంగాణ రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులకు గుడ్‌న్యూస్. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించిన ఐదు కొత్త హైబ్రిడ్ మొక్కజొన్న వంగడాలను (new maize hybrids Telangana 2025) భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) తాజాగా ఆమోదించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఐకార్ సమావేశంలో ఈ కొత్త వంగడాలను అధికారికంగా విడుదల చేశారు.
కొత్త వంగడాల పేర్లు (ICAR approved maize varieties)
డీహెచ్ఎం-144 (తెలంగాణ మక్క-6):
డీహెచ్ఎం-182
డీహెచ్ఎం-193
డీహెచ్ఎం-206 (తెలంగాణ మక్క-3):
డీహెచ్ఎం-218
ఈ కొత్త వంగడాలతో కలిసి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రూపొందించిన హైబ్రిడ్ మొక్కజొన్న రకాల సంఖ్య 24కి చేరిందని (Jayashankar agriculture university maize) వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జానయ్య తెలిపారు.
వీటిలో డీహెచ్‌ఎం 144 (తెలంగాణ మక్కా-6) రకంలో అధిక పిండి పదార్థాలు ఉండటం వల్ల ఇథనాల్ ఉత్పత్తికి బాగా అనుకూలంగా ఉంటుందని వివరించారు. అలానే డీహెచ్‌ఎం 206 (తెలంగాణ మక్కా-3) మెట్ట సాగుకు అనుకూలమైందని, ఎండు తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుందని చెప్పారు (Telangana corn seed innovation).
దేశవ్యాప్తంగా విస్తృతంగా వాడబడుతున్న తెలంగాణ విత్తనాలు
దేశవ్యాప్తంగా సాగులో ఉన్న మొత్తం మొక్కజొన్న విస్తీర్ణంలో 12 శాతం భాగాన్ని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వంగడాలు ఆక్రమించాయని వర్సిటీ గర్వంగా ప్రకటించింది. ఇది రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ రైతాంగ నైపుణ్యానికి నిదర్శనం.
16 పంటల రకాల అధికారిక గుర్తింపు
ఇటీవలి కాలంలో వర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన 16 పంటల రకాలు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా అధికారిక నోటిఫైడ్ వెరైటీస్‌గా గుర్తించబడ్డాయి. ఇవి వరి, గోధుమ, మొక్కజొన్న, బజ్రా వంటి ప్రధాన పంటల వంగడాలని తెలుస్తోంది.
రైతులకు విజ్ఞప్తి
ఈ సందర్భంగా వర్సిటీ వీసీ జానయ్య మాట్లాడుతూ, కొత్తగా విడుదలైన వంగడాల మూల విత్తనాలను పొందాలనుకునే రైతులు, విత్తన సంస్థలు వర్సిటీ అధికారులను సంప్రదించాలని సూచించారు. త్వరలోనే ఈ విత్తనాలు రైతుల వద్దకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
మొక్కజొన్న రైతులకు ఇది ఒక పెద్ద ఊరట. అధిక దిగుబడి, వ్యాధుల నిరోధకత, పిండిపదార్థాల పరంగా అగ్రస్థానంలో నిలిచేలా రూపొందించిన ఈ వంగడాలు, తెలంగాణ వ్యవసాయ రంగానికి కొత్త ఊపునివ్వనున్నాయి (Telangana maize farmer benefits). పరిశోధనను సాధనగా మార్చి రైతులకు నూతన అవకాశాలు కల్పించే దిశగా జయశంకర్ వర్సిటీ ముందడుగు వేసింది.
Read More:
Share your comments