
విశాఖపట్నం, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని మత్స్యకారులకు ఈ రోజు నుండి (ఏప్రిల్ 15) 61 రోజుల వేట నిషేధం ప్రారంభమైంది (fishing ban Andhra Pradesh 2025). జూన్ 15 వరకు సముద్రంలో మెకనైజ్డ్, మోటరైజ్డ్ పడవల వేట పూర్తిగా నిషేధించబడింది. వేట నిషేధం సమయం లో మత్స్య సంపదను సంరక్షించడంతోపాటు, రొయ్యలు, చేపలు సంతానోత్పత్తి చేసుకునే కాలానికి ఇబ్బందులు రాకుండా చూడడటమే ఈ నిర్ణయానికి ముఖ్య ఉద్దేశం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు (Andhra coast fishing rules)
పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, అండమాన్-నికోబార్ ద్వీపాలు సహా తూర్పు తీర ప్రాంతాల్లో ప్రతి ఏటా ఈ వేట నిషేధం అమలులో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మార్గదర్శకాలను అనుసరించి, ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు 61 రోజులపాటు చేపల వేటను నిషేధించింది (61-day fishing restriction AP). పులికాట్ సరస్సు వంటి ప్రత్యేక ప్రాంతాలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి.
మత్స్యకారులకు నియంత్రణలు – ఉల్లంఘనకు కఠిన చర్యలు
వేట నిషేధ కాలంలో ఇంజిన్, మోటరైజ్డ్ పడవలు సముద్రంలోకి వెళ్లకూడదు (Mechanized boat ban India). కేవలం సంప్రదాయ కర్రతెప్పలకే మినహాయింపు ఉంది. మత్స్యశాఖ అధికారులు, పోలీసులు నిబంధనలు పాటింపుపై పర్యవేక్షణ కొనసాగించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన మత్స్యకారులపై కేసులు నమోదు చేయబడతాయి. అంతేకాకుండా, వారు మత్స్యకార భరోసా వంటి సంక్షేమ పథకాల లబ్ధిని కోల్పోతారు.
రెండు నెలల ఉపాధి కోల్పోతే.. భరోసా మాత్రం ఉంది! (AP fisherfolk welfare scheme)
వేట నిషేధం కారణంగా మత్స్యకారులు ఉపాధిని కోల్పోతారు. దీనికి పరిహారంగా ప్రభుత్వం గతంలో బియ్యం ఇవ్వగా, అనంతరం నగదు రూపంలో సాయం అందిస్తోంది. మత్స్యకార భరోసా పథకం (Matsyakara Bharosa scheme 2025) కింద, ప్రస్తుతం ఒక్కో మత్స్యకారునికి రూ.20,000 చొప్పున అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది(₹20000 for AP fishermen). ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించబడినట్లు అధికారిక సమాచారం. మే నెలలో సర్వే నిర్వహించిన తర్వాత ఈ సాయం అందే అవకాశం ఉంది.
అనకాపల్లి నుంచి నెల్లూరు దాకా.. పర్యవేక్షణ కఠినం
విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లోని తీర గ్రామాల్లో మత్స్యశాఖ అధికారులు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లాలో 2,360 పడవలు, 14,000 మత్స్యకారులు, నెల్లూరు జిల్లాలో 25 ల్యాండింగ్ సెంటర్లు, 75 కిలోమీటర్ల తీరం ఉన్నాయి. మండలాల స్థాయిలో గ్రామాల వారీగా అధికారులకు సూచనలు జారీ చేశారు.
మత్స్య సంపద భవిష్యత్‌కు పెట్టుబడి
వేట నిషేధం వల్ల రొయ్యలు, చేపలు గుడ్లు పెట్టి, సంతానోత్పత్తి పూర్తిచేసుకోవడానికి సహాయపడుతుంది (fish breeding season ban). దీని వల్ల వచ్చే ఏడాది మత్స్య సంపద పెరుగుతుందని, మత్స్యకారుల ఆదాయం కూడా మెరుగవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
రెండు నెలలపాటు వేటలేకుండా ఉండాల్సిన అవసరం ఉన్నా, దీని వల్ల వచ్చే మేలును పరిగణనలోకి తీసుకుని మత్స్యకారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు పాటించడం వల్ల మత్స్యకారుల భవిష్యత్‌కు మేలు జరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వ వాగ్దానాల ప్రకారం, మత్స్యకార భరోసా కింద రూ.20,000 అందుతాయని అప్పటిదాకా ఆగాలని అధికారులు అంటున్నారు.
Read More:
Share your comments