News

భారత్ కి రానున్న భయంకరమైన వ్యవసాయ సంక్షోభం! మనమే నాశనం చేస్తున్నామా?

Sandilya Sharma
Sandilya Sharma
greenhouse gas emissions India, climate change farming, sustainable agriculture India
greenhouse gas emissions India, climate change farming, sustainable agriculture India

భారతదేశం తన పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించేందుకు, విదేశీ ఆహార దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు వ్యవసాయాన్ని వేగంగా అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ వేగవంతమైన వ్యవసాయ విస్తరణ తీవ్రమైన పర్యావరణ సమస్యలకు దారితీస్తోంది.

మితిమీరిన వ్యవసాయ భూవిస్తరణ, రసాయన ఎరువుల అధిక వినియోగం, నీటి వ్యర్థ వినియోగం (water misuse agriculture) వంటి పద్ధతులు మట్టి నాణ్యతను నాశనం చేయడమే కాదు, వాతావరణ మార్పును వేగవంతం చేస్తున్నాయి. ఈ అస్థిర వ్యవసాయ విధానమే భారతదేశంలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను పెంచుతున్నది. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి, నగరాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, పర్యావరణ వ్యవస్థలు భ్రష్టుపట్టుతున్నాయి.

వ్యవసాయ విస్తరణతో సమస్యలు (agriculture expansion india) 

భారతదేశ జీడీపీలో 16-18 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం, దేశ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో (greenhouse gas emissions india) రెండో పెద్ద కంట్రిబ్యూటర్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమెట్ చేంజ్ (UNFCCC)కు సమర్పించిన నివేదిక ప్రకారం, వ్యవసాయ రంగం నుండి ఉద్గారాలు 2016లో 2,531 MtCO2e నుంచి 2019 నాటికి 2,647 MtCO2e కి 4.5 శాతం పెరిగాయి.

అడవులు తొలగించి వ్యవసాయ భూములు విస్తరించడంతో, హైబ్రిడ్ పంటల సాగుతో, పాడి సాగుతో వాతావరణ మార్పు ముప్పు మరింత పెరిగింది.

వరి సాగు ప్రభావం (environmental impact of farming)

ప్రపంచంలో రెండవ అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా ఉన్న భారత్, 40.87 మిలియన్ హెక్టార్లలో వరి  సాగు చేస్తోంది. ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) అంచనా ప్రకారం, వరి సాగు కారణంగా సంవత్సరానికి సుమారు 60 మిలియన్ టన్నుల మీథేన్ వాయువు విడుదలవుతుంది.
ప్రాథమిక దశలో నీటితో ముంచే పద్ధతి వల్ల మీథేన్ మరియు నైట్రస్ ఆక్సైడ్ వాయు ఉద్గారాలు పెరిగి, మట్టి నాణ్యత కూడా దిగజారుతోంది (soil degradation).

ఎరువుల ప్రభావం

పంట దిగుబడిని పెంచేందుకు అధికంగా ఎరువులు వాడటం వలన:

  • మట్టి మరియు భూగర్భ జల కాలుష్యం పెరిగింది

  • గాలి ద్వారా వ్యాప్తి చెయ్యబడిన ఎరువుల ద్రావణాలు శ్వాస సంబంధిత, చర్మ సమస్యలకు దారితీస్తున్నాయి

  • నైట్రేట్ మరియు ఇతర రసాయనాలు నీటిలో కలిగి మానవ ఆరోగ్యానికి హాని చేస్తున్నాయి

అతిగా ఎరువుల వాడకం మట్టి సారాన్ని తగ్గిస్తుంది, అధిక నీటిపారుదలతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి.

ప్రభుత్వ చర్యలు

  • వరి సాగు తీవ్రత వ్యవస్థ (System of Rice Intensification - SRI): చిన్న మొక్కలను  విస్తృతంగా నాటి, సేంద్రీయ ఎరువులు ఉపయోగించడం

 

  • డైరెక్ట్ సీడెడ్ రైస్ (Direct Seeded Rice - DSR): నేరుగా విత్తనాలు నాటడం ద్వారా నీటి వినియోగం తగ్గించడం

 

  • మట్టి ఆరోగ్య కార్డు (Soil Health Card - SHC) స్కీం: మట్టి నాణ్యతను పరీక్షించి, తగిన ఎరువులను సిఫార్సు చేయడం

ముందుకు మార్గం

  • మిక్స్‌డ్ ఫార్మింగ్ మరియు బహుళ పంటల సాగు ద్వారా మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి

  • సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

  • రైతుల్లో మట్టి ఆరోగ్య కార్డు (SHC) అవగాహన పెంచాలి

  • హైడ్రోపోనిక్స్ వంటి ఆధునిక సాగు పద్ధతులను అభివృద్ధి చేయాలి

భవిష్యత్తులో మానవుని జీవన శైలిని ప్రభావితం చేసే వాతావరణ మార్పులకు నేటి వ్యవసాయ విధానాలే మూల కారణమని మరచిపోవద్దం.

Read More:

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు: సుస్థిర వ్యవసాయానికి తెలంగాణ రాష్ట్ర నూతన ప్రణాళిక

గిరిజన రైతుల ఆర్గానిక్ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌! మరింత అభివృద్ధికి ఇండస్ట్రియల్ పార్కులు!!

Share your comments

Subscribe Magazine

More on News

More