మలీహాబాద్ లోని ,అవధ్ ఆమ్ ప్రొడ్యూసర్స్ అండ్ హార్టి కల్చర్ కమిటీ ఆధ్వర్యంలో కొత్త మామిడి పండు రకం తయారీ - మోడీ పేరుతో నామకరణం. 2024 నుండి మార్కెట్ లో - మోడీ మాంగో
మామిడి కి మన దేశం పెట్టింది పేరు, దసరా , కేసరి , మంగినపల్లి, ఇలా ఎన్నో రకాలు , అన్ని ప్రత్యేక మైన రుచులు.అయినా ప్రతి సంవత్సరం ఇంకా మెరుగైన రకాలు తీసుకురడానికి కృషిచేస్తూనే ఉంటారు శాస్త్రవేత్తలు. అలానే 2019 లో మలీహాబాద్ లో కొత్త మామిడి పండు రకం తయారీ చేసారు -దానికి మోడీ పేరుతో నామకరణం చేశారు .2024 నుండి మార్కెట్ లో - మోడీ మాంగో
ప్రపంచ ప్రసిద్ధి చెందిన మామిడి రకం దస్సేరీ మాదిరిగానే, ఈ రకంలో ఫైబర్ కంటే ఎక్కువ గుజ్జు ఉంటుంది. 'మోడీ' మామిడి ఇతర మామిడిరకాల కంటే చాలా తియ్యగా ఉంటుందట.
2024లో ఈ మామిడి కాయలు కాతకు రానున్నాయి. అప్పుడు దీని రుచిని ప్రజలు చూస్తారని ఉపేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. ఈ రకం చెట్టు విలువ వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయినా దీనిని దేశంలోని ప్రతీ మూలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మోడీ మామిడిపళ్ళ మీద ఆయనకి ఉన్న ఇష్టాన్ని చాల సార్లు తెలిపారు, అందుకే దీనికి నరేంద్ర మోదీ అని పేరు పెట్టామని హార్టి కల్చర్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. "ఈ కొత్త రకం "దేశీ" మామిడి, పైభాగం లావుగా ఉంటుంది, ఇది మోడీ యొక్క 56 అంగుళాల ఛాతీని గుర్తు చేస్తుంది" అన్నారు
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ఈ రకాన్ని మోడీ పేరు తో నమోదు చేసి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను సింగ్‌కు అందజేసింది. అంటే ఇప్పుడు మరే ఇతర మామిడి రకానికి 'మోడీ' అని పేరు పెట్టలేము.
ఇది కూడా చదవండి
Share your comments