
రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు (Amaravati farmers assurance 2025). బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేందుకు తాము కట్టుబడినట్టు ఆయన స్పష్టం చేశారు (AP minister Narayana statement). అమరావతిపై కొన్ని వర్గాలు కావాలని అపోహలు సృష్టిస్తున్నాయని విమర్శించారు.
"రాజధాని నిర్మాణం అంటే కేవలం రోడ్లు, భవనాలు కాదు. ఇక్కడ ప్రజలు స్థిరపడాలి, యువతకు ఉద్యోగాలు (Amaravati jobs creation plan) కల్పించాలి. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్మార్ట్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి కాలుష్యభరిత పరిశ్రమలు కాకుండా, పారిశ్రామిక అభివృద్ధికి (AP industrial growth Amaravati) తోడ్పడేలా ఉంటాయి" అని మంత్రి నారాయణ వివరించారు.
భూముల విలువ పెరగాలంటే...
పరిశ్రమల ద్వారా భూముల విలువ గణనీయంగా పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. "రైతులు ఇచ్చిన భూముల ధరలు పెరగాలంటే అభివృద్ధి, పెట్టుబడులు రావాలి. అమరావతికి విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం. దీనికోసం ఐదు వేల ఎకరాలు అవసరమవుతాయి. వాటిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలా లేక భూసేకరణ చేయాలా అన్నదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం" అని తెలిపారు.
నిర్మాణ వేగానికి కార్యరూపం
అమరావతిలో రూ.64 వేల కోట్లతో పనులకు పరిపాలన అనుమతులు లభించాయని, టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. "ఎడాదిలోగా అధికారుల నివాసాలు పూర్తవుతాయి. ఏడాదిన్నరలో ట్రంకు రోడ్లు, రెండున్నరేళ్లలో లేఅవుట్ రోడ్లు, మూడేళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి చేస్తాం" అని చెప్పారు (Amaravati smart industries plan).
రైతులకు హామీ... అమరావతి భవిష్యత్
రైతులు ఇచ్చిన భూములు వృథా కాదని, వాటి విలువను రెట్టింపు చేసేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతిని స్మార్ట్, సమగ్ర, సుస్థిర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు (Chandrababu capital development).
Read More:
Share your comments