
అమెరికా సోయాబీన్, మొక్కజొన్న, కాటన్ మార్కెట్‌ను విస్తరించేందుకు భారత్‌పై దృష్టి పెడుతోంది. ఇవి అమెరికా ప్రధాన ఎగుమతి పంటలు కాగా, 2022లో వీటి ఎగుమతి విలువ 62 బిలియన్ డాలర్లకి చేరుకుంది.
భారత్‌లో పెరుగుతున్న డిమాండ్
USDA తాజా నివేదిక ప్రకారం, భారత జనాభా పెరుగుదల, ఆదాయ స్థాయి పెరుగుదలతో పాలు, గుడ్లు, చేపలు, మాంసాహారం లాంటి వాటికి డిమాండ్ పెరగనుంది. దీంతో, పశువుల మేతకి అవసరమైన పిండి పదార్థాలు, ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్‌పై ఆధారపడే అవకాశముంది.
- 2022-23లో 34.7 మిలియన్ టన్నులుగా ఉన్న మొక్కజొన్న వినియోగం, 2040 నాటికి 98 మిలియన్ టన్నులు, 2050 నాటికి 200.2 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా.
- సోయాబీన్ కూడిన ఆహార వినియోగం 6.2 మిలియన్ టన్నుల నుంచి 2040 నాటికి 30.9 మిలియన్ టన్నులు, 2050 నాటికి 68.3 మిలియన్ టన్నులకు చేరొచ్చు.
- ఈ డిమాండ్‌ను తీర్చేందుకు, 2040 నాటికి 46 మిలియన్ టన్నుల మొక్కజొన్న, 19 మిలియన్ టన్నుల సోయాబీన్ మీల్ దిగుమతులు అవసరమవుతాయి.
చైనా తగ్గించిన దిగుమతులు – అమెరికా కొత్త మార్కెట్ అన్వేషణ
చైనా 2022లో 5.2 బిలియన్ డాలర్ల విలువైన కార్న్ దిగుమతి చేసుకోగా, 2024 నాటికి అది 328 మిలియన్‌కి పడిపోయింది. కాటన్ దిగుమతుల పరంగా కూడా చైనా తన కొనుగోళ్లను తగ్గించడంతో, భారత్ వంటి కొత్త మార్కెట్లలో అమెరికా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తోంది.
ఇండో-అమెరికా వ్యాపార సంబంధాలపై ప్రభావం
అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్ ఎగుమతులపై ప్రతిగా టారిఫ్ విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో, భారత్-అమెరికా వ్యవసాయ వాణిజ్య ఒప్పందాలు కొత్త మలుపు తిరగబోతున్నాయి. అమెరికా రైతులకు కొత్త అవకాశాలను కల్పించడమే కాకుండా, భారత్ వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే వీలుంది.
Share your comments