
ఆంధ్ర ప్రదేశ్ లో కొద్ది రోజులుగా కురుస్తున్న వానల వల్ల, తీవ్ర పంట నష్టం వాటిల్లింది. అందులోను ముఖ్యంగా అరటి పళ్ళు సాగు చేసే రైతులకి భారీగా నష్టం జరిగింది. సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి వర్షం, వడగళ్ల తాకిడికి పంట నాశనం అయ్యేసరికి, రైతులు విలపిస్తున్నారు.
అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ఈ విషయం గురించి మాట్లాడారు. ప్రభుత్వం, వర్షాలవల్ల నష్టపోయిన ప్రతి రైతుకి, ఒక హెక్టారుకు గాను పూర్తిగా ఒక లక్ష పదివేల పరిహారం అందచేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీనిఇచ్చారు. ఈ 1,10,000 రూపాయల్లో, ఒక హెక్టారుకి 35,000 రూపాయిలు ఇన్ పుట్ రాయితి, అలానే మళ్ళీ సాగు మొదలుపెట్టేందుకు 75,000 రూపాయిలు మద్దతు లభిస్తాయని వివరించారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల ఆవశ్యక చర్యలు తీసుకుంటుందని, అకాలవర్షాల వల్ల కలిగిన పంట నష్టాన్ని పూర్తిగా రైతులు తట్టుకునే విధంగా మద్దతు ఇస్తామని, వడగండ్ల వానల వల్ల తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తుందని, రైతులకు ఎటువంటి నష్టం కలగనివ్వమని, అచ్చెన్నాయుడు వివరించారు.
ప్రస్తుతం అధికారులు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారని, దానిపైన నివేదిక రాగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని అన్నారు. ఇప్పటివరకు అరటి, మొక్కజొన్న, బొప్పాయి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది అని చెప్పారు.
ప్రస్తుతానికి అయితే హెక్టారుకు రూ.35,000 ఇన్పుట్ సబ్సిడీగా అందజేస్తామని, పొలాల్లో తిరిగి మొక్కలు నాటేందుకు అదనంగా మరో రూ.75,000 ఇవ్వనున్నట్లు, ఆంధ్రప్రదేశ్‌లో వడగండ్ల వర్షాలతో భారీగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అధికారులు నష్టాలను లెక్కించే ప్రక్రియ మొదలుపెట్టినట్టు తెలిపారు. త్వరలోనే మిగిలిన జిల్లాల్లోనూ ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు.
Share your comments