విదేశాలలోని నిపుణులతో రైతులను అనుసంధానం చేయడానికి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్( టీటా )టీ కన్సల్ట్ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందని, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ,మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. స్వయంగా మంత్రి నిపుణులతో అనుసంధానం అయి, ఈ యాప్ కు సంబంధించిన తొలి వినియోగదారుడి గా మారి, తెలంగాణ వ్యవసాయ వర్సిటీ మాజీ రిజిస్టర్, రిటైర్డ్ ప్రొఫెసర్ జలపతి రావు లను సందేశాలను అడిగి తెలుసుకున్నారు.
టీ కన్సల్ట్ సేవల ద్వారా రైతులను,అగ్రికల్చర్ సైంటిస్టులను అనుసంధానం చేయాలని సూచించారు. ఈ టీ కన్సల్ట్ యాప్ ను ఉమ్మడి పాలమూరు జిల్లాలోని, మక్తల్ లో ప్రారంభించారు. దీని ద్వారా 10 వేల కన్సల్టేషన్ లు చేయడాన్ని వ్యవసాయ మంత్రి అభినందించాడు. ఈ టీ కన్సల్టెంట్ అగ్రికల్చర్ అప్లికేషన్ ను వానకాలంలో రైతులందరూ ఉపయోగించుకోవాలని సూచించారు.
అగ్రికల్చర్ సైంటిస్ట్ లు ,ఎంటమాలజిస్టులు ఈ టీ కన్సల్టెంట్ లో మమేకమై రైతులకు సేవలందించాలని వ్యవసాయ శాఖ మంత్రి కోరారు. దీనిలో భాగంగానే తెలంగాణ వ్యవసాయ వర్సిటీ, శాస్త్రవేత్తలతో చర్చలు జరిపింది. దీనిని పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఒక మండలంలో నిర్వహించిన తర్వాత విదేశాలలోని నిపుణుల తోనూ మన తెలంగాణ రైతులను అనుసంధానం చేయాలని నిర్ణయించారు.
టీటా గ్లోబల్ ప్రెసిడెంట్, సందీప్ మక్తల్,మాట్లాడుతూ, టీటా ద్వారా ఇప్పటివరకూ విద్యార్ధులకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, సేవలు అందించామని, వీటికి కొనసాగింపుగానే, ప్రస్తుతం వ్యవసాయానికి అనుసంధానిస్తున్నామనీ, రైతులు తమ సందేహాలను, సూచనలను తెలపాలని చెప్పారు.
సేకరణ:కృపాదేవి చింతా(ఐ)
Share your comments