AP EAPCET Results out: AP EAPCET 2023 పరీక్ష ఫలితాలు ఈరోజు ( 14-June 2023) విడుదల అయ్యాయి. పరీక్ష రాసిన ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ/అగ్రికల్చర్ విద్యార్థులు అధికారక వెబ్సైటు లో, ఫలితాలను చూసివచ్చు అలాగే రాంక్ కార్డు ని కూడా డౌన్లోడ్ చేస్కోవచ్చు. రిజల్ట్స్ చెక్ చేసుకోడానికి లింక్ ని కింద చూడండి.
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి (APCHSE) AP EAMCET ఫలితాలను 2023 జూన్ 14, 2023న ప్రకటించింది, ఈ రోజు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా కాన్ఫరెన్స్ లో ఫలితాలను ప్రకటించారు. AP EAMCET ఫలితాలను APSCHE అధికారిక వెబ్‌సైట్‌లో https://cets.apsche.ap.gov.in/. చెక్ చేయాల్సి ఉంటుంది.
click here : AP EAPCET 2023 results
AP EAPCET ఫలితాలు 2023 ప్రకారం, ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఉత్తీర్ణత శాతం 76.32% కాగా, అగ్రికల్చర్ & ఫార్మసీ ఉత్తీర్ణత శాతం 89.65%. మొత్తం 3,38,739 మంది అభ్యర్థులు AP EAPCET 2023 కోసం నమోదు చేసుకున్నారు మరియు వారిలో 2.38 లక్షల మంది ఇంజనీరింగ్‌లో దరఖాస్తు చేసుకున్నారు మరియు 1,00,559 మంది అభ్యర్థులు అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) అనేది ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు మెడికల్ (ఫార్మసీ, వెటర్నరీ మొదలైనవి) వంటి వివిధ UG ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశాల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించబడే రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష.ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భాగస్వామ్య విశ్వవిద్యాలయాలు.., ప్రభుత్వ కళాశాలలో, ఇంజనీరింగ్ , అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సులలో ప్రవేశం పొందవచ్చు.
AP EAPCET కౌన్సెలింగ్ :AP EAPCET 2023 ఫలితాలు ప్రకటించిన తర్వాత, అర్హత పొందిన అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియకు రిజిస్టర్ చేసుకోవాలి. అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో తమను తాము నమోదు చేసుకోవాలి.విద్యార్థులు వారి ప్రాధాన్యత క్రమంలో కళాశాలను ఎంపిక చేసుకోవాలి.
మెరిట్ లిస్ట్‌లోని ర్యాంక్ ప్రకారం, వారి ప్రాధాన్య బ్రాంచ్‌లు & కాలేజీలను పరిగణించి సీట్ల కేటాయింపు జరుగుతుంది.
ఇది కూడా చదవండి
Share your comments