
ఏపీ ఆక్వా రైతులకు మరో దెబ్బ తగిలింది. అమెరికా విధించిన 26 శాతం దిగుమతి సుంకం (US tariff on Indian seafood) కారణంగా రొయ్యల ఎగుమతులు క్షీణిస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న 3 శాతం టారిఫ్ ఒకేసారి 26 శాతానికి పెరిగిపోవడంతో, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుంది.
ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. "ఆక్వా పరిశ్రమ దేశ ఆర్ధిక వ్యవస్థకు కీలకం. ఈ దిగుమతి సుంకం వల్ల ఏపీ జీడీపీలో 11 శాతం వాటా ఉన్న మత్స్యరంగం కుంగిపోతోంది," అని చంద్రబాబు పేర్కొన్నారు. భారత అమెరికా సుంకాల యుద్దాన్ని పరిష్కరించి, ఆంధ్రా రొయ్యల ఎగుమతులపై ( Andhra shrimp export tariff ) పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు.
ఈ పన్ను పెంపుతో అమెరికాకు 50 కౌంట్ లోపు వనామీ రొయ్యలు ఎగుమతి చేయడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 2.5 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఏటా రాష్ట్రం నుండి 17.2 లక్షల టన్నుల వనామీ రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతుంటే, ఈ పన్ను భారం వల్ల ఆయా ఆర్డర్లు ఇతర దేశాలకు మళ్లిపోతున్నాయి.

రొయ్య ధర కేజీకి రూ.30–50 వరకు పడిపోయింది.
రవాణా, ప్యాకింగ్ ఖర్చులతో కలిపి రైతులపై మొత్తం 50% భారంగా మారుతోంది. రెండు రోజుల కిందట 100 కౌంట్ రొయ్య ధర రూ.250 కాగా, ఇప్పుడు అదే రూ.210కి తగ్గింది. 80 కౌంట్ రొయ్యలు కేజీకి రూ.180–200కి అమ్మకాలు జరగడం రైతులకు తీవ్ర నష్టంగా మారింది.
రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, "వ్యాపారులు అన్ని కౌంట్ల రొయ్యల రేట్లు తగ్గించి మమ్మల్ని దోచుకుంటున్నారు," అంటున్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలంటూ కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రొయ్యల రైతుల సమస్యల (AP aqua farmers crisis)పై స్పందించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, "రైతులు ఆందోళన చెందవద్దు. కేంద్రం వారికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది," అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, వైసీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆక్వా రైతుల కష్టాల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నట్లు ఆరోపిస్తూ, "ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవాళ్లు సిండికేట్‌గా మారారు. రైతులకు అండగా మేం పోరాడతాం," అన్నారు.
ఈ పరిణామాలతో, 2025 అమెరికా ట్రేడ్ పాలసీ వల్ల (2025 US trade policy impact), తూర్పు గోదావరి రొయ్యల ఎగుమతులు ( West Godavari shrimp exports), కూడా బాగా దెబ్బ తిన్నాయి అని రైతులు.
Read More:
Share your comments