
ఇకపై ఆక్వా రైతులకి ఒక యూనిట్ కరెంట్ 1.50 రూపాయలకే లభించబోతోంది. కాకపోతే ఆ రైతులు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ అలా నమోదు చేసుకొని పక్షాన ఎటువంటి రాయితీ లభించబోదు. ఈ రాయితీకి జోన్ల తో సంభంధం లేదు, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం తప్పక చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లోని ఆక్వా రైతులకి ఇక మంచిరోజులు వచ్చాయి. బుధవారం సచివాలయంలో జరిగిన రెండో రోజు కలెక్టర్ల సదస్సులో అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఇందులో మత్స్యకారుల అభివృద్ధి గురించి కొన్ని కీలక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. టూరిజంతోపాటు ఆక్వా కల్చర్‌ను అభివృద్ధి చేయాలని, మత్య్సకారులను ఇందులో భాగస్వామ్యం చేయాలని, వెయ్యి టన్నుల చేపల ఉత్పత్తికి కృషి చెయ్యాలని ఈ సదస్సులో తీర్మానించారు. ఇకపై ఆక్వా రైతులకి ఒక యూనిట్ కరెంట్ 1.50 రూపాయలకే లభించబోతోందని, కాకపోతే ఆ రైతులు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఒకవేళ అలా నమోదు చేసుకొని పక్షాన ఎటువంటి రాయితీ లభించబోదని, ఈ రాయితీకి జోన్ల తో సంభంధం లేదని, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం తప్పక చేసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.
జిల్లాలో ఆక్వా, పౌల్ట్రీ ఆధారిత పరిశ్రమ అభివృద్ధికై 206 కోట్లతో ఎనిమిది యూనిట్ల ఏర్పాటు, అలానే వ్యాధుల తనిఖీలకు ఆక్వా ల్యాబ్ కట్టించబోతున్నట్లు తెలిపారు. మత్స్య ఆక్వా రంగాల్లో నాణ్యమైన చేపపిల్లల సరఫరా. భీమవరం జిల్లాలో చేపలు, రొయ్యల సాగు 1.33 లక్షల ఎకరాల నుంచి 1.50 లక్షల ఎకరాలకు పెంచే దిశగా పనిచేస్తున్నాం అని, జిల్లా కలెక్టర్ అన్నారు. ఇవేకాకుండా మత్స్యకారుల కోసం ప్రకటించిన 20 వేల వేటనిషేధ భత్యం ఏప్రిల్ లో అందజేస్తామని హామీనిచ్చారు.
చివరి రోజు జరిగిన కలెక్టర్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు బుధవారం జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. ‘‘ఏప్రిల్ నుంచి గ్రామాలకు సీనియర్ అధికారులు వెళ్లి ప్రజలు ఎలా జీవిస్తున్నారు , వాళ్ళ ప్రమాణాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలి. అసలు ఒక ఊరులో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే సదస్సు ఉద్దేశం.’’ అని చంద్రబాబు అధికారులని ఆదేశించారు.
Share your comments