భారతదేశంలో బరువులు మోయడం, బరువుతోకూడిన పనులు చేయడం చాలా సహజం..కానీ, భారతదేశంలో మహిళలు చాలా మంది వంటచెరుకు కోసం అటవి ప్రాంతాలకు పోయి..కట్టెలమోపును ఎత్తుకోని కొన్ని కిలోమీటర్ల దూరం ఆ బరువులను తలపైన మోస్తుంటారు.అలాంటివారి బాధను మాటల్లో ఎంతచెప్పినా తక్కువే..అంతేకాకుండా భారతదేశంలో చాలా మహిళలు పేడను ఎత్తడం,విత్తనాలు ఏరడం, కూరగాయలు తెంపడం, పశుగ్రాసం వేయడం, లాంటి పనులను మహిళా కార్మికులే ఎక్కువగా చేస్తారు. ఇంకా తెంపిన పండ్లను, కూరగాయలను, పొలం నుండి ఇంటికి మోసుకొస్తారు.అలాగే నిర్మాణ పనులలో మహిళలు ఇటుకలను, సిమోంటు ఇటుకలను తలపైన పెట్టుకుని మోస్తుంటారు.వీరు బరువులు మోసీ , మెడ,తల, భుజాలు,నడుం నొప్పితో బాధ పడుతుంటారు.త్వరగా అలసిపోతుంటారు. అధికబరువులు మోయడం వలన కొంతమంది మహిళలలో గర్భ స్రావం కూడా జరగుతుంటుంది.అలాంటి మహిళల శ్రమని , తొలిగించడానికి ,రైతు మహిళలను, నిర్మాణ రంగంలో పనిచేసే మహిళలకోసం తయారు చేయబడినదే ఈ బరువు యంత్ర పరికరం.
ఇది పనిచేసే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం..
ఇందులో 3 భాగాలుంటాయి.
మొదటిభాగం: భుజాలకు మద్దతుగా దీనిని తయారు చేసారు.మగవాళ్ళు చొక్కా వేసుకున్నట్టుగా దానిని రెండు భుజాల మీదుగా పెట్టుకోవాలి.
రెండో భాగం: ఇది వెదురు తట్టలా ఉంటుంది. దీనిని తల మీద పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. దీనిని పశుగ్రాసాన్ని ,లేదా గంపను పెట్టుకోవడానికి అనుకూలంగా తయారు చేశారు.
మూడవ భాగం: దీనిలో పట్టీని అమర్చారు. ఈ పట్టీని నడుముకు కట్టుకోవడం ద్వారా ఈ పరికరం పడిపోకుండా ఉంటుంది.
ఈ పరికరం ఖచ్చితమైన కొలతలను కలిగి ఉంటుంది.
ప్రేమ్ పొడవు 22.5 సెం.మీ,
ప్రేమ్ చుట్టుకొలత 17 సెం.మీ,
ప్రేమ్ వెడల్పు 36 సెం.మీ కొలతలతో ఉండి, దీని వెనుక భాగం పొడవు40.8 సెం.మీ, ఉంటుంది.
ఈ పరికరాన్ని ముందుగా నిర్మాణ స్థలం లో లేదా పొలం లో ఉపయోగించే ముందు, దీనిని భుజాలమీద పెట్టుకొని వెనకనుంచి బెల్ట్ లేదా పట్టీని నడుముకు కట్టుకోవాలి. తట్ట లాంటి భాగాన్ని తల మీద పెట్టుకొని, దానిమీద కట్టెలు లేదా గడ్డి లాంటివి పెట్టి మోసుకుని వెళ్ళవచ్చు. ఈ పరికరాన్ని భుజాలు, నడుముకు సరిపోయేలా రూపొందించారు. ఈ పరికరం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనిని భుజాలపైన పెట్టుకోవడం ద్వారా వెనుకభాగం కండరాల పైన ఒత్తిడి పడదు. శారీరక శ్రమతో పాటు, తల, మెడ, భుజాలు, నడుము నొప్పి తగ్గుతుంది. పని కూడా త్వరగా అవుతుంది. ఈ పరికరం ఖరీదు రెండు వేల రూపాయలు.
కృపాదేవి చింతా(ఐ)
Share your comments