
తెలంగాణ భూముల నిర్వహణలో పారదర్శకత కోసం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 'భూభారతి' పోర్టల్‌ను అధికారికంగా ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించగా, ఇది పాత 'ధరణి' పోర్టల్‌కు బదులు భవిష్యత్ వేదికగా మారనుంది (Bhubharati Telangana land details).
ఇదొక్కటే దేశంలో భూములకు ‘యూనిక్ ఐడీ’ అయిన 'భూధార్ నంబర్' అందించే తొలిపద్ధతి. మనిషికి ఆధార్ ఉంటే, భూమికి భూధార్ ఉండాలన్నది భూభారతి లక్ష్యం.
సేవలు ఎలా పొందాలి (Telangana Bhu Bharati services)?
ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మీరు ఇంటి నుంచే మీ భూమి వివరాలు తెలుసుకోవచ్చు.bhubharati.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు.
మీ భూమి ఉన్న జిల్లా, మండలం, గ్రామం లేదా పాస్‌బుక్ నంబర్ ఎంటర్ చేసి యజమాని పేరు, భూమి పరిమాణం, లొకేషన్, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ వంటి వివరాలు పొందవచ్చు (Telangana land records online).
ప్రస్తుతం ఇది నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుంది.
ముఖ్యమైన ఫీజుల వివరాలు (bhubharati portal services fees)
భూములకు సంబంధించి ఈ ప్లాట్‌ఫామ్‌పై పలు సేవలు ఫీజుతో లభ్యమవుతున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
- పాస్ పుస్తకం జారీకి (land passbook fees Telangana Bhu Bharati): ₹300
- మ్యూటేషన్ దరఖాస్తు (land mutation fees Telangana Bhu Bharati)
- ఎకరానికి: ₹2,500
- గుంటకు ₹62.50
- రికార్డుల్లో తప్పుల సవరణకు (record correction fees Telangana Bhu Bharati): ₹1,000
- అప్పీల్ దాఖలు కోసం (application of appeal fees Telangana Bhu Bharati): ₹1,000
- స్లాట్ బుకింగ్ మార్పులు(slot booking fees Telangana Bhu Bharati):
- మొదటిసారి ఉచితం
- రెండోసారి ₹500
- మూడోసారి ₹1,000
ఇవి అన్నీ ప్రజలకే హితమైన రీతిలో, ప్రామాణికంగా విధించబడ్డాయి.
భూధార్, పాస్ పుస్తకాలు, అప్పీల్ వ్యవస్థ (land passbook and appeal system)
ప్రతి భూమికి భూధార్ నంబర్ ఇవ్వనున్నారు. ఈ ఆధారంగా పాస్‌పుస్తకాలు జారీ చేయబడతాయి. పాస్‌పుస్తకం కోసం ₹300 ఫీజుతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సర్వే చేసిన తర్వాత మ్యాప్ రూపొందించి, ఎమ్మార్వో ఆ పుస్తకం జారీ చేస్తారు.
ఒకవేళ ఇందులో లోపాలు ఉంటే మీరు ఆర్డీవో వద్ద అప్పీల్ చేయొచ్చు. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్ వద్ద, ఇంకా ముందు బహుళ స్థాయిల్లో అప్పీల్ చేసే అవకాశం ఉంది.
భూభారతి ప్రత్యేకతలు (Telangana Bhu Bharati specifications)
- ధరణి లాగ కాకుండా, భూభారతిలో రెవెన్యూ రికార్డులు ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న అప్‌డేట్ చేస్తారు.
- మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత న్యాయసహాయం అందించనున్నారు.
- సాదా బైనామాల క్రమబద్ధీకరణకు స్టాంప్ డ్యూటీ, ఫీజుతో పాటు ₹100 జరిమానా చెల్లిస్తే చాలు.
- దశల వారీ అప్పీల్ వ్యవస్థ
భూమి సంబంధిత సమస్యలు ఇక మిమ్మల్ని వెంటాడవు. భూభారతి ద్వారా తెలంగాణలో భూసేవల్లో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయం అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
Read More:
Share your comments