తెలంగాణ రెవిన్యూ శాఖ లో పనిచేస్తున్న , గౌరవ వేతనం పై పనిచేస్తున్న సుమారు 23,000 మంది వీఆర్ఏ లను రెగ్యూలరైజ్ చేస్తామని రాష్ట్ర కాబినెట్ ప్రకటించింది.
రెవెన్యూ శాఖలో జీతాల ప్రాతిపదికన పనిచేస్తున్న సుమారు 23,000 మంది గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) ఉద్యోగాలను రెగ్యూలరైజ్ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ పరిణామంపై రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇది కూడా చదవండి
నిరసన చేస్తున్న మహిళపై చేయిచేస్కున్న పోలీస్: అధికారి పై చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యలు
రెవెన్యూ శాఖలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పరిపాలన సజావుగా సాగేందుకు పనిభారాన్ని పరిగణనలోకి తీసుకుని వీఏలకు పే స్కేల్ వర్తింపజేసి రెవెన్యూ శాఖలో కొనసాగించాలి, వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, అర్హులైన అభ్యర్థులను ప్రోత్సహిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ విషయమై గతంలో సీఎంతో చర్చించామని, రెవెన్యూ శాఖలో వీఆర్ఏలను కొనసాగిస్తూనే ఆప్షన్ల ద్వారా కేవలం 3వేల మందిని నీటిపారుదల శాఖకు పంపుతామని హామీ ఇచ్చారని తెరాస ప్రతినిధులు అందరికీ గుర్తు చేశారు. కావున ప్రభుత్వం రెవెన్యూ విధులకు సిబ్బందిని కేటాయించి శాఖను పటిష్టం చేయాలని కోరారు. రాష్ట్రంలోని వీఆర్ఏలందరినీ రెగ్యులరైజ్ చేసినందుకు తెరాస నాయకులు మంత్రి కేటీఆర్, హరీశ్‌రావులకు అభినందనలు తెలిపారు.
ఇది కూడా చదవండి
Share your comments