
ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఉల్లిగడ్డల ఎగుమతుల మీద విధించిన 20% సుంకాన్ని కేంద్రం ఎత్తివేస్తూ ఉత్తరువులు జారీచేసింది. గతంలో ఉల్లిపాయల డిమాండ్ దేశంలోనే ఎక్కువగా ఉండటంతో కేంద్రం ఈ ఉల్లిపాయల ఎగుమతుల పై 2024లో సుంకం విధించింది.
వీటి కంటే ముందు 2023 డిసెంబర్ 8నుంచి మే 3, 2024 వరకు ప్రభుత్వం ఉల్లి ఎగుమతిని పూర్తిగా నిషేధించింది. ఈ చర్యలతో దేశంలో ఉల్లిపాయల సాగు వేగం పుంజుకొని, ధరలు అంబరాన్ని అందకుండా ఆపగలిగారు. కానీ దీనివల్ల రైతుకి సరైన గిట్టుబాటు ధర అందటం తగ్గిపోయింది. ఈ సమస్యని పరిష్కరించేందుకే భారత రెవెన్యూ శాఖ ఉల్లిగడ్డల ఎగుమతుల మీద విధించిన 20% సుంకాన్ని ఎత్తివేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
మహారాష్ట్రలోని లాసల్‌గావ్, పింపల్‌గావ్ మార్కెట్లలో మార్చి 21న క్వింటాల్ ఉల్లి ధర వరుసగా ₹1,330, ₹1,325గా ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి హోల్‌సేల్ మార్కెట్. ఎలాగో ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి 18 వరకు 1.17 మిలియన్ టన్నుల ఉల్లి ఎగుమతులు జరిగినా దేశంలో ఉల్లిగడ్డల కొరత కలగలేదు, అలానే రైతులకి కూడా సరైన ధర అవసరం ఉండటంతో ఈ చర్యకు కేంద్రం శ్రీకారం చుట్టింది. దీనికి సంభందించిన ఉత్తరువులు రెవెన్యూ శాఖ తాజాగా రిలీజ్ చేసింది.
ఈ ప్రభుత్వ నిర్ణయం రైతుల శ్రేయస్సు, సామాన్య ప్రజల ఆర్ధిక స్థితి రెండు తూకం వేసాకే తీసుకుందని అధికారులు అంటున్నారు. మండీలో ధరలు ప్రస్తుతానికి అధికంగా ఉన్నకాని, భారిత సగటు మోడల్ ధరలు 39శాతం తగ్గుముఖంపట్టాయి. అలానే రిటైల్ ధరలు ఒక నెలలోనే 10 శాతం తగ్గాయి. అందుకనే ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఉల్లిగడ్డల ఎగుమతుల మీద విధించిన 20% సుంకాన్ని కేంద్రం ఎత్తివేస్తూ ఉత్తరువులు జారీచేసింది.
వ్యవసాయ మంత్రిత్వ శాఖ లెక్క ప్రకారం, ఈ సంవత్సరం రబీ సీజన్లో ఉల్లిగడ్డల ఉత్పత్తి 22.7 మిలియన్ టన్నులుగా ఉండొచ్చని అంచనా. పోయిన సంవత్సరం 19.2 మిలియన్ టన్నుల దిగుబడితో పోలిస్తే ఇది 18% అదనపు పెరుగుదల. భారతదేశం పూర్తి ఉల్లిసాగులో సింహభాగం, అంటే సుమారు 70-75% వాటా రబీ పంటది. ఈ ఖరీఫ్ సీజన్ అంటే అక్టోబర్ నుండి నవంబర్‌లో కల్లా ఉల్లి పంట మార్కెట్‌కు రాకపోతే, రబీ జరిగిన సాగు దిగుబడి ఇక దేశీయ ధరల్ని మార్చడంలో ముఖ్యపాత్ర పోషించనుంది
Share your comments