News

పంట నష్టనష్టపరిహారం 5790 రైతుల ఖాతాల్లో జమ! మిగతా రైతుల పరిస్థితి ఏంటి?

Sriya Patnala
Sriya Patnala
Crop loss compensation credited in 5790 farmer accounts
Crop loss compensation credited in 5790 farmer accounts

గత యాసంగి సీజన్లో వడగళ్ల వానలకు రెండు రాష్ట్రాల్లో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది.ఈ మేరకు అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులను కేసీఆర్ సందర్శించి, నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని ఇస్తామని ప్రకటించారు. ఎట్టకేలకు ప్రభుత్వం నష్ట పరిహారాలను రైతుల ఖాతాల్లో విడుదల చేసింది.

రైతుల వివరాల సర్వే పూర్తిచేసిన ప్రభుత్వం ,ఒక్కో రైతు ఖాతా చెక్‌ చేసి వారి ఖాతాల్లో పరిహారం జమచేస్తున్నారు.వ్యవసాయ శాఖాధికారులు , సోమవారం ముత్తారం మండల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయగా, మంగళవారం జూలపల్లి, ధర్మారం, కాల్వశ్రీరాంపూర్‌ మండలాల రైతుల ఖాతాల్లో జమ చేశారు.ప్రభుత్వ సర్వె నివేదికల ప్రకారం , మార్చి 15 నుంచి 20వ తేదీ వరకు కురిసిన అకాల వర్షాలకు 8 మండలాల్లోని 64 గ్రామాల్లో 6910.02 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలను సాగు చేసిన 5790 మంది రైతులు నష్టపోయారు. వీరికి మాత్రమే సోమవారం నుండి ఒక్కొక్కరిగా నష్ట పరిహారం జమ చేస్తున్నారు.

మిగతా రైతుల పరిస్థితి ఏంటి?

మర్చి లో జరిగిన పంట నష్టాలకు గాను ప్రభుత్వం జిల్లాకు 6.9 కోట్ల పరిహారం మంజూరి చేసింది . అదే విధంగా ఏప్రిల్‌లో మూడు పర్యాయాలుగా కురిసిన వర్షాలకు 21,948 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయలు, ఇతర పంటలను 15,570 మంది రైతులు నష్టపోయారని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. కానీ మార్చి నెలలో పంట నష్టపోయిన రైతులకే ప్రభుత్వం 6. 9 కోట్లను రెండు నెలల తర్వాత విడుదల చేసింది .ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుల ఖాతాల్లో సోమవారం నుంచి డబ్బులు జమ అవుతున్నాయి. ఆ తర్వాత కురిసిన పంటల నష్టాన్ని అంచనా వేసిన అధికారులు ప్రభుత్వానికి పంపించినప్పటికీ, ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. మిగతా నష్ట పరిహారాలు గురించి రీతులలో అయోమయం నెలకొంది. ఏప్రిల్‌ మాసంలో దెబ్బతిన్న పంటలకు సంబంధించి నివేదికలను ప్రభుత్వానికి పంపించామని, సుమారు 22కోట్ల రూపాయల పరిహారం మంజూరుకావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు.

మార్చిలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పరిహారం సొమ్ము విడుదల కావడంతో సోమవారం నుంచి రైతుల ఖాతాలను చెక్‌ చేసుకుంటూ డబ్బులను జమచేస్తున్నామని తెలిపారు. నాలుగైదు రోజుల్లో మిగతా రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవుతుందని సమాచారం.

ఇది కూడా చదవండి

రుతుపవనాలు వచ్చేశాయ్! భారీ వర్ష సూచనలు.. ఈ జిల్లాలపై అధిక ప్రభావం

Related Topics

Crop loss telangana

Share your comments

Subscribe Magazine

More on News

More