News

తెలంగాణ రైతులకి భారీ పంట నష్టం! 11,300 ఎకరాలకి మద్దతు?

Sandilya Sharma
Sandilya Sharma

తెలంగాణాలో కొద్దిరోజులుగా అకాలవర్షం, వడగళ్ళు కురవడంతో రైతులకు భారీనష్టం వాటిల్లింది. ప్రాధమిక అంచనాల ప్రకారం దాదాపు 11,300 ఎకరాల పంట నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇందులో 6,670 ఎకరాల వరి, 4,100 ఎకరాల మొక్కజొన్న, అలానే 309 ఎకరాల మామిడి తోట దెబ్బతిన్నాయి. మార్చ్ 21 నుండి 23 దాకా అంటే కేవలం రెండే రోజుల్లో, 64 మండలాలు, 13 జిల్లాలో 11,300 ఎకరాల పంట నష్టం జరిగింది. 

గతకొన్ని రోజులుగా తెలంగాణాలో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అకాలవర్షాభావం, వడగళ్ళు ఇలా తీవ్ర పరిణామాలు చోటు చేసుకునేసరికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల జరిగిన పంట నష్టం గురించిన నివేదికని అందించాలని అధికారులని సూచించారు. వాళ్ళు రైతులవారీగా సర్వే చేసి, ఒక ప్రాధమిక రిపోర్ట్ తయారు చేశారు. మార్చ్ 21 నుండి 23 దాకా, 64 మండలాలు, 13 జిల్లాలో పడ్డ వర్షాల వల్ల కలిగిన, ఈ పంట నష్టం నివేదిక తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి అందింది. ఈ నివేదిక ప్రకారం అకాలవర్షాల వల్ల 6,670 ఎకరాల వరి, 4,100 ఎకరాల మొక్కజొన్న, అలానే 309 ఎకరాల మామిడి తోట, అలానే కొన్ని చిన్న పంటలు, మొత్తం కలుపుకొని దాదాపు 11,300 ఎకరాల పంట నాశనం అయ్యింది.    

జరిగిన ఈ నష్టానికి రైతులకి పరిహారం లభిస్తుందని, ఇంకా పూర్తి స్థాయి నివేదిక రావలసి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకి ఎటువంటి నష్టం కలుగదని, ఈ విషయం గురించి మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రస్థాయిలో నష్ట తీవ్రతను తెలుసుకునేందుకు అధికారులతో దర్యాప్తు నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం ప్రాధమిక నివేదికలో 11,300 ఎకరాల సాగు నష్టం కలిగినట్టు తెలిసిందని, అయితే ఇంకా చివరి వివేదిక రాలేదని, మంత్రి తుమ్మల వివరించారు.

Share your comments

Subscribe Magazine