జీవిత ప్రయాణంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైతేనే, మన ఆలోచనలు అవసరాలకు అనుగుణంగా ఆయుధాలుగా మారుతాయి. అని,
నిరూపించాడు. నిజామాబాద్ జిల్లా కు చెందిన పోత్కూరి మహేష్. తనకు కావలసిన వ్యవసాయ పరికరాలను తనే స్వయంగా తయారు చేసుకుంటూ, వ్యవసాయాన్ని లాభసాటిగా మలచుకున్నాడు. తన వ్యవసాయ క్షేత్రంలో యూరియా వేయాలంటే కనీసం ఎకరానికి ఐదుగురు కూలీలు అవసరం. కానీ, ఈ మధ్యకాలంలో కూలీల కొరత ఎక్కువగా ఉండడంతో అతనికి ఓ మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. యురియా వేయడానికి ఫెర్టిలైజర్ గన్ ను కేవలం రూ.320 కే తయారుచేసి, తను సాగుచేసే మొక్కజొన్న పంటకు ఆ గన్ తో రెండు గంటల్లో యూరియాను వేసాడు. గతంలో కోతుల బెడద నుండి పంటను రక్షించేందుకు మంకీ గన్ ను కూడా తయారుచేసి, పంట పొలాలకు రక్షణ కల్పించిన ఆ యువ రైతు శాస్త్రవేత్తకు అభినందనలు తెలుపుదాం.
Share your comments