గతంలో ఆగ్రా లో రైతులు బంగాళా దుంప పంట లో మద్యం పిచికారీ చేసి ఎక్కువ లాభాలు, పొందారు అన్న వార్త వినపడింది. అదే విధంగా ఇప్పుడు మధ్య ప్రదేశ్ లోని రైతులు కొత్త వ్యవసాయ పద్దతులు పాటిస్తూ అందరి ద్రుష్టి ని ఆకర్షిస్తున్నారు.
నివేదికల ప్రకారం మధ్య ప్రదేశ్ , నర్మదాపూర్ లోని రైతులు యాసంగి లోని పెసర పంటల్లో ఉత్పత్తి పెంచడానికి దేశి మద్యాన్ని పిచికారీ చేసారు. మద్యం వళ్ళ తమ పంట లో ఉంత్పతి దాదాపు రెట్టింపు అయింది అని రైతులు చెప్తున్నారు.
దాని వెనక ఉన్న కారణాలు వారికీ తెలియనప్పటికీ, మద్యం వళ్ళ తమ దిగుబడి కచ్చితంగా పెరిగింది, పంట క్వాలిటీ కూడా మెరుగ్గా ఉంది అని వారు చెప్పడం జరిగింది. దీంతో కేవలం నర్మదాపూర్ లోనే కాకా మిగతా గ్రామాల్లో కూడా రైతులు ఈ మద్యం - పిచికారీ ని ఫాలో అవుతున్నారు .
రైతుల్లో ఇది సులువుగా ప్రాచుర్యం పొందడానికి ముఖ్య కారణం ఇది చాల తక్కువ ఖర్చు తో కూడుకున్నాది. పిచికారీ చేయడం కూడా చాల సులువు అంటున్నారు రైతులు. 100 ml మద్యాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తున్నటు తెలిపారు.
మరోవైపు సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త కేకే . మిశ్ర ఈ ప్రకియ తో ఏకిభావించడం లేదు. రైతులు నమ్ముతున్నట్టు పెసర పంటల్లో మద్యం పిచికారీ చేయడం వళ్ళ ఎలాంటి ప్రయోజనం ఉండదు అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
వ్యవసాయ నిపుణుల ప్రకారం, మద్యం పిచికారీ చేస్తే పంట ఉత్పత్తి పెరుగుతుంది అని చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవు, అలాగే మద్యం పిచికారీ వళ్ళ పంటలకు ఎటువంటి హాని కూడా జరగదు. మద్యం పిచికారీ చేయడం వళ్ళ పొలం లో కొంత వరకు పురుగుమందులాగ పనిచేస్తుంది అలానే కొన్ని రకాల కలుపు మొక్కలకు మందుల పనిచేస్తుంది అని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.
ఇది కూడా చదవండి
Share your comments