
తెలంగాణ బియ్యం అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశించడంతో రాష్ట్రానికి మరొక మైలురాయి చేరింది. కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండా ఊపి ప్రారంభించారు.
ఫిలిప్పీన్స్‌కు భారీ ఎగుమతి ఒప్పందం
తెలంగాణ ప్రభుత్వం MTU 1010 రకం ముడి బియ్యాన్ని ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద మొత్తం 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయనుంది.
తొలి విడత రవాణా వివరాలు
- తొలి విడతగా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతికి లోడింగ్ ప్రక్రియ పూర్తి.
- ఈ బియ్యం ట్రంగ్ ఎన్ నౌక ద్వారా ఫిలిప్పీన్స్‌కు తరలింపు.
- కాకినాడ పోర్టులో అధికారికంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించి, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బియ్యం రవాణాను ప్రారంభించారు.
తెలంగాణ బియ్యం అంతర్జాతీయ మార్కెట్లోకి
ఈ ఒప్పందం తెలంగాణ బియ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక అడుగుగా భావిస్తున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు, ఫిలిప్పీన్స్ ప్రతినిధుల హాజరులో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ బియ్యం గ్లోబల్ మార్కెట్లో స్థిరపడే అవకాశం ఉంది.
ఈ ఎగుమతులతో రైతులకు కొత్త అవకాశాలు పెరిగే అవకాశం ఉండటంతో పాటు, రాష్ట్రం వ్యవసాయ రంగంలో మరో ముందడుగు వేయనుంది.
Share your comments