
భారతదేశ మత్స్యశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో నిర్వహించిన ఫిషరీస్ స్టార్టప్ కాంక్లేవ్ (Fisheries Startup Conclave) మత్స్యకారుల భవిష్యత్తును మార్చే కీలక సంఘటనగా నిలిచింది. ఈ కాంక్లేవ్‌లో "ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2.0" ని అధికారికంగా ప్రారంభించారు. ఈ ఛాలెంజ్ లో నమోదు చేసుకోవడానికి మే 11 ఆఖరు తేదీ.
ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం ఫిషరీస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు అవసరమైన సహాయం అందించడం, మత్స్య పరిశ్రమను ఆధునికీకరించడం. ఫిషరీస్ టెక్నాలజీ, ఆక్వాకల్చర్, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెట్ లింకేజెస్ వంటి అంశాల్లో యువ పారిశ్రామికవేత్తలకు గొప్ప అవకాశాన్ని అందించనుంది.
స్టార్టప్ ఛాలెంజ్ 2.0 – ఒక బిగ్ బిజినెస్ అవుట్‌లుక్
ఈ ఛాలెంజ్‌లో 10 గ్రాండ్ విన్నర్స్ ఎంపిక చేయబోతున్నారు. ప్రతి విన్నర్‌కు ₹10 లక్షల క్యాష్ ప్రైజ్, మొత్తం ₹1 కోటి మొత్తాన్ని స్టార్టప్‌ల అభివృద్ధికి కేటాయించారు.
అంతేకాకుండా, విజేతలకు ఇన్క్యుబేషన్ సపోర్ట్, మెంటారింగ్, టెక్నికల్ గైడెన్స్, మార్కెట్ లింకేజెస్ లాంటి ముఖ్యమైన సేవలు కూడా లభిస్తాయి. దీని ద్వారా ఆక్వా ఎంట్రప్రెన్యూర్లు తమ ఆలోచనలను వాస్తవంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఫిషరీస్ స్టార్టప్ ఛాలెంజ్ (Fisheries Startup Challenge) 2022లో మొదటిసారి నిర్వహించినప్పుడు, 12 స్టార్టప్‌లు విజేతలుగా ఎంపికయ్యారు. వారికి రూ.2 లక్షల ప్రైజ్ మనీ, రూ.20-30 లక్షల వరకు సీడ్ ఫండింగ్ అందించడంతోపాటు మత్స్య పరిశ్రమ అభివృద్ధి (Fisheries Industry Growth) కావాల్సిన మౌలిక వనరులు అందించారు. 2025లో మరింత భారీ స్థాయిలో నిర్వహించిన ఈ రెండవ ఎడిషన్ ద్వారా స్టార్టప్‌లకు మరింత శక్తివంతమైన వేదిక లభించింది.

మత్స్యకారుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రణాళికలు
భారత ప్రభుత్వం మత్స్యరంగ అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటోంది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) & ఫిషరీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (FIDF) కింద పెద్ద ఎత్తున మత్స్యకారులకు మద్దతు అందిస్తోంది.
- 66 ఫిషింగ్ హార్బర్లు & 50 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అభివృద్ధికి ₹9,558.91 కోట్లు కేటాయించబడ్డాయి.
- 6.16 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది.
- 2.5 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నారు.
- ₹5,915.54 కోట్లతో 141 ప్రాజెక్టులు మంజూరయ్యాయి.
- ONDCతో ఒప్పందం ద్వారా డిజిటల్ మార్కెట్ సదుపాయాలు అందించనున్నారు.
అలాగే ICAR, NFDB, మరియు ప్రైవేట్ ఇన్వెస్టర్లు స్టార్టప్‌లకు మెంటారింగ్, ట్రైనింగ్, మరియు ఫిషరీస్ మార్కెట్ లింకేజెస్ (Fisheries Market Linkages) అందించనున్నారు. కొత్త వ్యాపార అవకాశాలను ఉపయోగించుకునే సమయం ఆసన్నమైంది!
ఫిషరీస్ రంగంలో ఆధునికత – టెక్నాలజీ ప్రభావం
భారతదేశంలోని మత్స్య పరిశ్రమను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం పలు రకాల నూతన పరిజ్ఞానాలను ప్రవేశపెడుతోంది.
- ఆక్వాకల్చర్ టెక్నాలజీ (Aquaculture Technology) – మత్స్యకారులకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి వచ్చేలా శాస్త్రీయ పద్ధతులను అందుబాటులోకి తేవడం.
- బయోఫ్లాక్ టెక్నాలజీ – చేపల పెంపకాన్ని శుభ్రమైన నీటిలో నిర్వహించే ఆధునిక సాంకేతికత.
- ఐస్ ప్లాంట్లు & కోల్డ్ స్టోరేజ్ – చేపల తాజాదనాన్ని కాపాడేందుకు 634 కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయడం.
- ఈ-కామర్స్ వృద్ధి – ONDC ద్వారా మత్స్యకారులు తమ ఉత్పత్తులను డిజిటల్ మార్కెట్‌లో విక్రయించే అవకాశం, దీనివల్ల మత్స్యకారుల ఆదాయం పెంపు (Fishermen Income Growth).
ఎవరెవరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి?
ఈ కార్యక్రమం ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలు, రైతులు, స్వయం ఉపాధి మార్గాలను వెతుకుతున్న యువత, భారత్‌లో స్టార్టప్ అవకాశాలు (Startup Opportunities in India), కొత్త వ్యాపార దారులు అన్వేషిస్తున్న వ్యక్తులు కోసం ఏర్పాటు చేశారు.
మీ దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉందా?మీరు మత్స్యకార రంగాన్ని ఆధునికంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా?
అయితే ఈ స్టార్టప్ ఛాలెంజ్ 2.0 మీకోసమే!
చాలెంజ్ రిజిస్ట్రేషన్ వివరాలు
ఆఖరు తేదీ: మే 11, 2025
రెజిస్ట్రేషన్ లింక్: startupindia.gov.in
మత్స్యకార రంగానికి కొత్త దశ, కొత్త దిశ!
తెలంగాణలో జరిగిన ఈ ఫిషరీస్ స్టార్టప్ కాంక్లేవ్ దేశవ్యాప్తంగా మత్స్యకారులను, యువ పారిశ్రామికవేత్తలను ప్రేరేపించే విధంగా నిలిచింది. ఈ ఛాలెంజ్ 2.0 ద్వారా యువత బిజినెస్‌లోకి ప్రవేశించి, తమ కొత్త ఆవిష్కరణలతో చేపల పరిశ్రమను విస్తృత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
Read More:
Share your comments