ఒకప్పుడు ఇంటికి ‘గ్యాస్ సిలిండర్’ బుక్ చేయాలంటే గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. డిజిటల్ పరికరాలు పెరిగాక ఆ పరిస్థితుల నుంచి చాలా మేరకు ఉపశమనం లభించింది. స్మార్ట్‌ఫోన్ వచ్చాక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే ప్రక్రియ చాలా సులభంగా మారింది.ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ నంబర్‌కు కాల్ చేసినా లేదా వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసినా సిలిండర్ బుక్ అవుతుంది .
అయితే గ్యాస్ కంపెనీలు సిలిండర్ బుక్ చేసుకునే విధానాన్ని మరింత సులభతరం చేశాయి. వాట్సప్‌లో ఒక్క మెసేజ్ పెడితే చాలు సిలిండర్ ఇంటికి వచ్చేస్తుంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఇక నుంచి వాట్సప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ కంపెనీలు తాజాగా ఈ పద్ధతిని ప్రవేశ పెట్టాయి. హెచ్‌పీ, భారత్ గ్యాస్, ఇండెన్ వంటి కంపెనీల గ్యాస్ సిలిండర్లను వాట్సప్ ద్వారా బుకింగ్ చేసుకునే వెలుసుబాటు కల్పించాయి.
మీకు కావాల్సిన కంపెనీ వాట్సాప్ నంబర్‌కు నేరుగా ఒక్క మెసేజ్ పెట్టి.. సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అలాగే కొత్త కలెక్షన్ కూడా వాట్సాప్ ద్వారా తీసుకోవచ్చు. ఇందుకోసం వాట్సప్‌లో కొత్త కనెక్షన్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే చాలు. హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు 9222201122 నంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్ పెట్టాలి. వాట్సప్‌లో Hi అని టైప్‌చేసి సెండ్ చేయాలి. ఆ త్వరాత వచ్చే మెనూలో పలు రకాల సేవలు వస్తాయి. అందులో మీకు అవసరమైన ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అయితే ముందుగా మీ ఫోన్లో ఈ నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. భారత్ గ్యాస్ వినియోగదారులు 1800224344 నంబర్‌కు, ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 7588888824 లేదా 7718955555 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాలి.
ఇది కూడా చదవండి
Share your comments