News

హెచ్ సీయూలో ముదురుతున్న వివాదం, తప్పెవరిది ?

Sandilya Sharma
Sandilya Sharma
Image Courtesy: X/@MissionTG
Image Courtesy: X/@MissionTG

కంచ గచ్చిబౌలి హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ భూములను చదును చేయడానికి జరిగిన ప్రయత్నం తెలంగాణలోనే కాక దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ ఆవ‌ర‌ణంలో భూమి వేలం వేయడానికి నిర్ణయించుకున్న ప్రభుత్వం, ఆ భూమిని జేసీబీలతో చదునుచేసే క్రమంలో అక్కడ ఉన్న అడవులను, పశుపక్ష్యాదులను హింసకు గురిచేస్తున్నారు అని ప్రకృతిని దెబ్బ తీస్తున్నారని, విద్యార్థి సంఘాలు ఆందోళ‌న చేస్తున్నాయి.

అయితే ఈ 400 ఎక‌రాల భూమిని రాష్ట్ర మౌలిక స‌దుపాయాల సంస్థ‌కు ప్ర‌భుత్వం కేటాయించి, తర్వాత ఈ భూమిని అభివృద్ధి చేసి, తర్వాత ఐటీ సంస్థ‌ల‌కు విక్ర‌యించే ప్రణాళికలో టీజీఐఐసీ ఉంది. 

ఈ  నేపథ్యంలో ఆదివారం ఈ స్థలాన్ని జేసీబీలతో చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసులకు మధ్య ఘర్షణ చేసుకోవటంతో తీవ్ర ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. 

ప్రస్తుతం భూముల వేలాన్ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ అడ్డుకుంటామ‌ని విద్యార్థి సంఘాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. వర్శిటీ భూమిలో వేలాది చెట్లు, పక్షులు, వివిధ రకాల జంతువులు, వందల సంవత్సరాల నాటి శిలలు ఉన్నాయి, వాటిని కాపాడడానికి ఎక్కడిదాకా అయినా వెళ్తామని  విద్యార్థి సంఘాలు హెచ్చరించారు. 

అయితే ఈ విషయం గురించి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…  కంచ గచ్చిబౌలిలోని భూముల్లో ఒక్క అంగుళం కూడా  హెచ్​సీయూ కింద రాదని , ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు పన్నుతున్న పన్నాగమని, వీరే  ప్రభుత్వ పనులకు అడ్డుకట్ట వేస్తున్నారని  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తదితరులు మండిపడ్డారు.

ఈ  400 ఎకరాల భూమిని తీసుకోవడం న్యాయమే అని,  హెచ్​సీయూ వద్ద ఉన్న జీవ వైవిధ్యాన్ని కాపాడుతామని, కాని ప్రభుత్వ పనులను  ఆపితే కఠిన చర్యలు తప్పవని ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్​ బాబు మాట్లాడుతూ, స్పష్టం చేశారు. 

ఈ చర్యల వల్ల కోట్లాది రూపాయల భూములను ప్రైవేటు వ్యక్తుల నుంచి కాపాడి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాము అని అన్నారు.

అయితే ప్రస్తుతం హెచ్ సీయూ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు ఆందోళనతీవ్రతరం అయ్యింది. ఓవైపు బీజేపీ, సీపీఎం నాయకులు కూడా ధర్నాకి దిగారు. విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో, వేచి చూడాలి.

Share your comments

Subscribe Magazine

More on News

More