
దేశవ్యాప్తంగా రైతులకు పెద్ద ఊరటగా కేంద్ర ప్రభుత్వం 2025 ఖరీఫ్ సీజన్‌లో ఫాస్ఫరస్, పొటాష్ (పీ అండ్ కే), ఎరువులకు పోషక ఆధారిత సబ్సిడీ NBS రేట్లను అందించేందుకు 37,216.15 కోట్ల బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో పీ అండ్ కే ఎరువులు రైతులకు చౌక ధరల్లో అందుబాటులోకి రానున్నాయి.
రైతులకు భారీ ప్రయోజనం
- రైతులు సబ్సిడీతో తక్కువ ధరలకు ఎరువులు పొందే అవకాశం.
- మన్ను ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ ఎరువులు పంట దిగుబడిని పెంచుతాయి.
- దేశవ్యాప్తంగా ఆహార భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
₹37,216.15 కోట్ల బడ్జెట్ – గతేడాది కంటే ₹13,000 కోట్లు అధికం
2025 ఖరీఫ్ సీజన్ కోసం కేటాయించిన ₹37,216.15 కోట్ల బడ్జెట్ గత రబీ సీజన్ కంటే ₹13,000 కోట్ల మేర ఎక్కువ. అంతర్జాతీయ ఎరువుల ధరల్లో జరిగిన మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
ఎరువులపై సబ్సిడీ విధానం
- 2025 ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఫాస్ఫరస్, పొటాష్ ఎరువులకు సబ్సిడీ వర్తింపు.
- ఎన్పీకేఎస్ గ్రేడ్లు సహా అన్ని పీ అండ్ కే ఎరువులకు రాయితీ కొనసాగింపు.
సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ (SSP) రవాణా ఖర్చుల సబ్సిడీ కూడా పొడిగింపు.
రైతుల కోసం కేంద్రం కట్టుబాటు
ఈ సబ్సిడీ అమలు ద్వారా రైతులు చౌక ధరల్లో ఎరువులను పొందగలిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైతులు ఈ పథకాలను వాడుకొని తమ వ్యవసాయాన్ని అబివృద్ధి చేసుకోవాలి.
Share your comments