News

దివంగత యువ తెలంగాణ శాస్త్రవేత్త అశ్వినికి అమరగౌరవం, IARI స్మారక చిహ్నం

Sandilya Sharma
Sandilya Sharma
Poosa Chana 4037 details- agricultural research tribute India- Ashwini chickpea yield (Image Courtesy: Instagram)
Poosa Chana 4037 details- agricultural research tribute India- Ashwini chickpea yield (Image Courtesy: Instagram)

‘తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే వంగడాలను కనుగొంటానమ్మా... నన్ను వ్యవసాయ శాస్త్రవేత్త అంటారమ్మా’ అంటూ తన తల్లితో ఎప్పుడూ చెప్తూ, వ్యవసాయ రంగంలో యువ ప్రతిభావంతురాలిగా వెలుగొందిన తెలంగాణ శాస్త్రవేత్త నూనావత్ అశ్వినికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. అకాల మరణం చెందిన ఆమె పేరు ఇప్పుడో నూతన శనగ వంగడానికి పెట్టడంతో, తన పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా నిలిచిపోనుంది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI - Indian Agricultural Research Institute) ఇటీవల ఆవిష్కరించిన ‘పూస శనగ - 4037’ అనే కొత్త వంగడికి, తన గౌరవార్ధం,  ‘అశ్విని’ అనే పేరు పెట్టింది (Ashwini chickpea variety India).

ఈ నెల 14న న్యూఢిల్లీ లోని ఐఏఆస్ఐఐ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈ కొత్త శనగ వంగడాన్ని విడుదల చేశారు (IARI new chickpea release 2025). ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇచ్చే ప్రత్యేకత కలిగిన శనగ రకం. అశ్వినిని స్మరిస్తూ, ఆమె విజ్ఞానపరమైన కృషికి గుర్తింపుగా ఈ పేరు పెట్టడం ఎంతో గర్వకారణం (Telangana scientist honor).

అశ్వినికి విద్యారంగంలో అపూర్వ గణన

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సమీపంలోని గంగారం తండాకు చెందిన నూనావత్ అశ్విని విద్యాభ్యాసంలో ప్రతిభను చిన్ననాటి నుంచే చాటింది. కారేపల్లిలో 10వ తరగతి పూర్తి చేసిన ఆమె, ఇంటర్ విజయవాడలో కొనసాగించింది. అనంతరం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చదివి బంగారు పతకం సాధించింది.

ఆ తర్వాత హైదరాబాదులోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసి గోల్డ్ మెడల్స్ సాధించింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా చేరి పనిచేస్తోంది. ఆమె చేసిన పరిశోధనలు, పరిజ్ఞానం వ్యవసాయ రంగానికి ఎంతో దోహదపడే విధంగా దేశవ్యాప్త గుర్తింపు పొందాయి.

ఘోర ప్రమాదం – కోల్పోయిన వెలకట్టలేని జీవితం

అశ్విని గత సంవత్సరం సెప్టెంబరు 1న తన తండ్రి మోతీలాల్‌తో కలిసి ఒక సెమినార్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ సమీపంలో ఆకేరు వాగులో నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయి ఇద్దరూ మృతిచెందారు. ఈ సెమినార్‌లోనే ఆమెకు అవార్డు అందాల్సి ఉండగా, ఆమె జీవిత యాత్ర అర్ధాంతరంగా ముగిసింది. ఈ విషాదకర సంఘటనకు పలువురు శోకసంద్రంలో మునిగిపోయారు.

జీవితాన్ని అంకితం చేసిన వృత్తిపట్ల శ్రద్ధ

‘తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే వంగడాలను కనుగొంటానమ్మా... నన్ను వ్యవసాయ శాస్త్రవేత్త అంటారమ్మా’ అంటూ తన తల్లి నేజాతో చెప్పిన మాటలు ఆమె వ్యవసాయం పట్ల తనకి ఉన్న ప్రేమని చాటేవి (Telangana scientist honor). ఆమె తల్లి మాట్లాడుతూ, “ఇప్పుడూ నా బిడ్డ పేరు శనగ రకానికి పెట్టారంటే అది శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది మా కుటుంబానికి గర్వకారణం” అని భావోద్వేగంతో స్పందించారు.

స్ఫూర్తిదాయక జీవిత గాథ

అశ్విని జీవితం ప్రతి యువతి, యువకుడికి ప్రేరణగా నిలుస్తోంది. పట్టుదల, కృషితో కొండెక్కిన ఆమె జ్ఞాపకార్థంగా శాశ్వతంగా నిలిచేలా చేసిన ఈ గౌరవం తల్లిదండ్రులకు, సమాజానికి ఎంతో గర్వకారణం. ఆమె ప్రతిభను గుర్తించిన ఐఏఆస్ఐఐ నిర్ణయం వ్యవసాయ రంగంలో మహిళల పాత్రను మరింత వెలుగులోకి తీసుకువచ్చింది.

వనితా శాస్త్రవేత్తగా దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయక ముద్ర వేసిన అశ్వినికి ఈ ‘అశ్విని శనగ’ ఒక స్మారక చిహ్నంగా మారబోతోంది. ఆమె స్మరణతో రైతుల పొలాల్లో అశ్విని శనగ పండుతుంటే, అది తెలంగాణ గర్వంగా తలెత్తుకునే రోజు.

Read More:

మక్కబుట్ట రైతులకు శుభవార్త! కొత్త మొక్కజొన్న హైబ్రిడ్ వంగడాలు ఇవే!!

పట్టు సాగుతో లాభాల పంట: వరంగల్‌లో పట్టు పరిశ్రమకు ఊపెత్తిన ప్రోత్సాహం

Share your comments

Subscribe Magazine

More on News

More