News

రూ.1600 కోట్లతో కొత్త M-CADWM ఉపపథకం ప్రారంభం, రైతులకు మంచిదేనా ?

Sandilya Sharma
Sandilya Sharma
M-CADWM scheme 2025, PMKSY modernization of irrigation in India (Image Courtesy: Google Ai)
M-CADWM scheme 2025, PMKSY modernization of irrigation in India (Image Courtesy: Google Ai)

భారతదేశ వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించే దిశగా మరో కీలక అడుగు పడింది. ప్రధాని కృషి సించాయి యోజన (PMKSY)లో భాగంగా "మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్ (M-CADWM)" అనే ఉపపథకాన్ని కేంద్ర క్యాబినెట్ మంజూరు చేసింది. 2025-26 సంవత్సరానికి ఈ పథకానికి రూ.1600 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయం అంగీకరించబడింది. సాగునీటి సరఫరా, నీటి వినియోగ సమర్థత (water management agriculture), వ్యవసాయ ఉత్పాదకత భూగర్భ జలాల రక్షణ (groundwater recharge farming India), మరియు వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయం(climate-resilient agriculture India), సాధించడమే ఈ పథకం యొక్క లక్ష్యం.

ఎం-సీఏడీడబ్ల్యూఎం (command area development scheme) అంటే ఏంటి?

ఈ పథకం లక్ష్యం:

  • ఇప్పటికే ఉన్న కాలువల ద్వారా ఆయకట్టు ప్రాంతాలకు నీరు సమర్థంగా అందించే విధంగా వ్యవస్థను ఆధునికీకరించడం.
  • భూగర్భ పీడనంతో కూడిన పైపు నీటి పారుదల వ్యవస్థలు ఏర్పాటు చేయడం.

  • ఒక్కో హెక్టార్ వరకు నీటిని సమర్థంగా సరఫరా చేయడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం.

  • వాటర్ అకౌంటింగ్, స్కాడా, IoT టెక్నాలజీలను వినియోగించి సమర్థవంతమైన నీటి నిర్వహణను సాధించడం.

రైతులకు ప్రయోజనాలేంటీ?

  • ప్రతి హెక్టారుకు తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించడానికి ఇది సహకరిస్తుంది.
  • సమర్థవంతమైన సాగునీటి వ్యవస్థల ద్వారా నీటి వినియోగం తగ్గుతుంది, దిగుబడులు పెరుగుతాయి.
  • పొలం వద్దకే నీరు అందడంతో జలసాధనాల వృథా తగ్గి, ఖర్చులు తగ్గుతాయి.
  • సాంకేతిక వినియోగం వల్ల యువత వ్యవసాయం వైపు ఆకర్షితమవుతారు.
  • సాగునీటి సంఘాలు నిర్వహణ బాధ్యతలు స్వీకరించడంతో నిర్వహణలో పారదర్శకత పెరుగుతుంది.
₹1600 crore CADWM project (Image Courtesy: Google Ai)
₹1600 crore CADWM project (Image Courtesy: Google Ai)

ప్రతిపాదిత మార్గం

  • రాష్ట్రాలకు చాలెంజ్ ఫండింగ్ ద్వారా ప్రయోగాత్మక ప్రాజెక్టులకు అనుమతినిచ్చారు.
  • ఈ ప్రాజెక్టుల విజయాన్ని బట్టి, 2026 ఏప్రిల్ నుంచి జాతీయ స్థాయిలో ప్రణాళిక అమలుకు సిద్ధమవుతారు.
  • FPOలు, PACSలతో సాగునీటి సంఘాల అనుసంధానం వల్ల వ్యవసాయం మరింత స్థిరతను పొందనుంది.

"ఎం-సీఏడీడబ్ల్యూఎం" పథకం ద్వారా సాగునీటిని సమర్థవంతంగా వినియోగించడమే కాకుండా, రైతుల ఆదాయం పెంచడం, భూగర్భ జలాల రక్షణ, మరియు వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం. ఒకవైపు నీటి భద్రత, మరోవైపు ఆహార భద్రతను పరిరక్షించడంలో ఈ పథకం కీలకంగా మారనుంది. ఈ ప్రణాళిక నిజంగా అమలవుతోంటే రైతులకు ఇది మంచి సంకేతం అని చెప్పొచ్చు.

Read More:

ఇజ్రాయిల్‌తో వ్యవసాయ ఒప్పందం – భారత రైతులకు లాభమా? నష్టమా?

ఉద్యానవన పంటలే భవిష్యత్‌ – రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ

Share your comments

Subscribe Magazine

More on News

More