News

2025 బ్రిక్స్ వ్యవసాయ సమావేశంలో భారత్ కీలక పాత్ర: చిన్న రైతుల సంక్షేమానికి మద్దతు

Sandilya Sharma
Sandilya Sharma
India at BRICS agriculture summit 2025 (India's leadership in global farming) (Image Courtesy: X)
India at BRICS agriculture summit 2025 (India's leadership in global farming) (Image Courtesy: X)

బ్రెజిల్‌లో జరిగిన 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం ద్వారా, భారతదేశం మరోసారి ప్రపంచ వ్యవసాయ రంగంలో తన కీలక భూమికను చాటుకుంది. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం పాల్గొన్న ఈ సమావేశంలో భారత్ చిన్న, అట్టడుగువ వర్గ రైతులకు పెద్దపీట వేసింది. అలానే వారి కోసం తీసుకున్న విధానాలకు భారత్ మద్దతు తెలిపింది.

బ్రిక్స్ వ్యవసాయా సమ్మిట్ లో భారత్ (India at BRICS agriculture summit 2025)

“వ్యవసాయం అంటే భారత్‌కు కేవలం ఆర్థిక అవసరం మాత్రమే కాదు… అది జీవనాధారం, ఆహార భద్రత, ఆత్మగౌరవానికి ప్రతీక,” అంటూ మంత్రి చౌహాన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 510 మిలియన్ల చిన్న రైతులు ఆహార వ్యవస్థకు వెన్నెముకలని, వారు వాతావరణ మార్పులు, ధరల పెరుగుదల, వనరుల కొరత వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు.

వారిని ఒంటరిగా వదిలేస్తే గ్లోబల్ ఆహార భద్రతకు ముప్పు అని, వారిని బలంగా నిలబెట్టే విధానాలు అవసరమని భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌పీఓలు, సహకార మోడల్స్, ప్రకృతి వ్యవసాయం, క్లస్టర్ ఆధారిత సాగు వంటి విధానాలను మంత్రి పరిచయం చేశారు.

భారత్ మోడల్స్ – ‘డిజిటల్ అగ్రికల్చర్’ నుండి ‘లక్షపతి దీది’ వరకు

భారత్ యొక్క డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, అగ్రిస్టాక్, డ్రోన్ టెక్నాలజీ, క్లైమేట్ రెసిలియెంట్ గ్రామాలు, లక్షపతి దీది, డ్రోన్ దీది వంటి కార్యక్రమాలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇది సేవల పంపిణీలో పారదర్శకతను తీసుకొచ్చినట్టే, రైతుల ఆదాయాన్ని కూడా పెంచిందని చెప్పారు.

Shivraj Singh Chouhan agriculture speech- Land Restoration Partnership (Image Courtesy: X)
Shivraj Singh Chouhan agriculture speech- Land Restoration Partnership (Image Courtesy: X)

మట్టిని కాపాడే కొత్త ఒప్పందం (BRICS Land Restoration Partnership)

వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడేందుకు BRICS భూమి పునరుద్ధరణ భాగస్వామ్యం ప్రారంభించారు. ఇది భూభాగాల నాశనం, ఎండిపోయిన భూములు, మట్టి సారాన్ని కోల్పోతున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో రూపొందించారు. ప్రాచీన వ్యవసాయ పద్ధతులు + శాస్త్రీయ పరిజ్ఞానం కలగలిపిన ఈ దృష్టికోణం చిన్న రైతులకు, గిరిజనులకు అత్యంత లాభదాయకం.

బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశ ముఖ్యాంశాలు (BRICS agriculture ministers meeting highlights)

సమావేశ ముగింపులో బ్రిక్స్ దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇందులో:

  • సమగ్ర, సమానత్వపూరిత వ్యవసాయ వ్యవస్థ (Global agriculture cooperation BRICS)
  • మహిళలు, యువత, చిన్న రైతుల సాధికారత

  • సస్టైనబుల్ ఫిషరీస్, పశుపోషణ అభివృద్ధి

  • డిజిటల్ సర్టిఫికేషన్, నాణ్యమైన ఉత్పత్తుల ప్రమాణీకరణ

  • ఫైనాన్షియల్ మెకానిజమ్స్, వ్యాపార ప్రోత్సాహక విధానాలు

బ్రెజిల్ పర్యటనలో మరో కీలక అంశం – సోయాబీన్ ఉత్పత్తి భాగస్వామ్యం

భారత్ ప్రస్తుతం సోయాబీన్ ఆయిల్‌ను దిగుమతి చేస్తోంది. అయితే ఈ సమావేశంలో మంత్రి చౌహాన్ సోయాబీన్ సాగు, ప్రాసెసింగ్ కోసం బ్రెజిల్‌తో భాగస్వామ్యం పెంపు సూచించారు. ఇందుకు అనువైన టెక్నాలజీ, మొక్కల విత్తనాలు, మ్యాకానైజేషన్ విషయంలో రెండు దేశాలు కలసి ముందడుగు వేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

వేద మంత్రంతో భారత సంప్రదాయాల ప్రతినిధిగా చౌహాన్ (Shivraj Singh Chouhan agriculture speech)

“సర్వే భవంతు సుఖినః… సర్వే సంతు నిరామయాః…” అనే వేద మంత్రంతో ఆయన ప్రసంగాన్ని ముగించారు. ఇది భారతదేశం యొక్క వసుధైవ కుటుంబకము సిద్ధాంతానికి నిదర్శనం. ఇండియా-బ్రెజిల్ వ్యవసాయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా, బ్రిక్స్ దేశాలతో టెక్నాలజీ, వాణిజ్య, విద్య, పునరుత్పాదక వ్యవసాయం రంగాల్లో కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు (India agriculture diplomacy BRICS).

బ్రెజిల్ పర్యటనలో మంత్రి చౌహాన్ చేసిన ప్రతీ అడుగు – చిన్న రైతుల సాధికారత (Supporting small farmers globally), సుస్థిర వ్యవసాయ అభివృద్ధి, టెక్నాలజీ హస్తాంతరణ, అంతర్జాతీయ వాణిజ్య ప్రోత్సాహం – అన్నీ కలిసీ భారత రైతుకు గ్లోబల్ అండ కల్పించే దిశగా పునాది వేశారు. 15వ బ్రిక్స్ వ్యవసాయ సమావేశం భారత వ్యవసాయరంగాన్ని అంతర్జాతీయ వేదికపై మరింత బలంగా నిలబెట్టింది.

Read More:

రాష్ట్ర రైతులకు మరో శుభవార్త: కొత్తగా 50,000 ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు

రైతులకు బంపర్ న్యూస్, వ్యవసాయ వ్యర్ధాలతో బంగారం…. 15 కొత్త ప్లాంట్లు !

Share your comments

Subscribe Magazine

More on News

More