
కడప జిల్లా మండల పరిధిలోని పలు గ్రామాల్లో గొర్రెలు, మేకలలో గొంతు వాపు, పారుడు వ్యాధులు ప్రబలుతున్నాయి (Kadapa sheep diseases). దీంతో వందల సంఖ్యలో జీవాలు మృత్యువాత పడుతున్నాయి. పాడి పశుపోషణపై ఆధారపడే రైతులలో తీవ్ర ఆందోళన నెలకొంది. రెడ్డివారిపల్లె, గొడుగునూరు, నల్లవాగుపల్లె వంటి గ్రామాల్లో ఈ వ్యాధి మహమ్మారి లాగా వ్యాపిస్తోంది.
పశువైద్యం అందక రైతుల ఆవేదన:
గ్రామస్థుల కథనం ప్రకారం, గత వారం రోజులుగా ఉన్నట్లుండి మేకలు, గొర్రెలు గొంతు వాపుతోపాటు కడుపుబ్బరం (Diarrhea disease in goats), పారుడుతో క్షణాల్లో చనిపోతున్నాయి (Goat throat swelling symptoms). రెడ్డివారిపల్లెకు చెందిన సుంకర పెద్దన్న 20 మేకలు, 30 గొర్రెలు కోల్పోయారు. మరో రైతు కత్తికొండయ్య 15 మేకలను, తులశమ్మ 16 మేకలను కోల్పోయారు. శవ పరీక్ష చేసిన పెద్దన్న మాట్లాడుతూ, "చనిపోయిన మేకను చీల్చి చూశాం... లివర్ పూర్తిగా పొడలు పొడలుగా, బొబ్బలు బొబ్బలుగా ఉంది. ఇది సాధారణ పరిస్థితి కాదు," అని ఆవేదన వ్యక్తం చేశారు.
కడప రైతుల ఆందోళన (Farmers worried in Kadapa):
రైతులు మేకలు చనిపోతున్న విషయంపై అధికారులకు తెలియజేసినా, ఇప్పటివరకు ఎటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "తాము పశువైద్యాధికారులను పిలిచినా సరైన వైద్యం అందించకపోవడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది" అని వారు వాపోతున్నారు.
పశువులకు నాణ్యమైన వైద్యం ఎక్కడ (Veterinary Help)?
ఇటీవలి కాలంలో పశువులకు వైద్యం అందించడంలో అధికారుల అలసత్వం కనిపిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. గోవిందాయపల్లెకు చెందిన ఒక రైతు "లక్ష రూపాయల విలువైన పాడి పశువుకు జబ్బు వచ్చిన తర్వాత వైద్యుడు వచ్చి 'ముసర వ్యాధి' అని చెప్పాడు. మందులు వాడినా పశువు మృతి చెందింది" అని చెప్పారు.
తక్షణ చర్యల కోసం గ్రామస్తుల డిమాండ్:
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, గ్రామస్తులు ప్రభుత్వం మరియు పశువైద్య శాఖ అధికారులను తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మండల స్థాయిలో వైద్య శిబిరాలు (Veterinary camps Andhra Pradesh) ఏర్పాటు చేసి, వ్యాధి నివారణకు మందులు, టీకాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ తరహా వ్యాధుల కారణంగా రైతులు అనేక ఆర్థిక, భావోద్వేగ నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఈ అంశంపై స్పందించకపోతే, పశుపోషణపై ఆధారపడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం వాటిల్లే అవకాశముంది (Sheep farming issues Telugu states). శాశ్వత పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి స్పందించాల్సిన సమయం ఇది.
Read More:
Share your comments