కర్ణాటక అసంబ్లీ ఎన్నికల్లో , ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలను బట్టి ,కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ తో మొత్తం 224 స్థానాల్లో ,136 సీట్ల ఆధిక్యత తో విజయం సాధించింది.
కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణపై కర్ణాటక ఎన్నికలు ఫలితాలు ప్రభావం చూపవని అన్నారు. హైదరాబాద్, బెంగళూరులు భారతదేశం అభివృద్ధి కోసం పెట్టుబడులు, మౌలిక సదుపాయాలను సృష్టించడం కోసం ఆరోగ్యంగా పోటీ పడాలని ఆకాంక్షించారు. ‘కర్ణాటక ప్రజలను రంజింపజేయడంలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో.. అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవు.. కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు
కర్ణాటకలో మే 15న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. శాసనసభ ఎన్నికల్లో 135 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారం చేపట్టనుంది. అయితే, సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో సీఎం ఎవరనే ఉత్కంఠ నెలకుంది. డీకే శివకుమార్ జన్మదినం రోజునే సర్కారు కొలువుదీరనుండగా.. ఆయనకు అధిష్ఠానం పుట్టిన రోజు కానుక ఏం ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Share your comments