తెలంగాణ లో కూడా ఇదే రూల్ తీసుకురడానికి కసరత్తు ! ఇదేం కొత్త రూల్ అనుకుంటున్నారా, ఈ రూల్ కేరళ లో ఎప్పటినుండో అమలు లో ఉంది. అక్కడ విద్యార్థులు " నేను కట్నం తీసుకోను, ఇవ్వను, ప్రోత్సహించను " అని హామీ ఇచ్చిన తర్వాతే కళాశాలలోకి, విశ్వ విద్యాలయాలలోకి ప్రవేశం ఉంటుంది. ఇలా అని చెప్పి విద్యార్థులు వారి తల్లిందండ్రులు ఒప్పుకుంటూ స్వీయ అంగీకార పత్రం మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వారికి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. భవిష్యత్తులో వారు వరకట్నం అడిగినా, వేధించినా, పోలీసులుతో పాటు ఆయా యూనివెర్సిటీలకు కూడా ఫిర్యాదు చేయొచ్చు. యూనివర్సిటీ ఆ ఆరోపణలు నిజమేనా అని విచారణ చేసి నిజం అని తేలితే వారి డిగ్రీ ని శాశ్వతంగా రద్దు చేస్తుంది.
రెండేళ్ల క్రితం కేరళ యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్న గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీసుకున్న సంచలన నిర్ణయం కేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లో చేర్చనీయాంసంగా మారింది. భారతదేశంలో పెరుగుతున్న వరకట్న వేధింపులు మరియు గృహ హింస కేసులను పరిష్కరించడం ఈ నిర్ణయం లక్ష్యం. సెంట్రల్ స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన 'విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2022' సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం, గృహహింస కేసుల్లో తెలంగాణ 50.4 శాతంతో రెండో స్థానంలో ఉండడం విచారించాల్సిన విషయం, గృహహింస కేసుల్లో 75 శాతంతో అస్సాం అగ్రస్థానంలో ఉండగా, 48.9 శాతంతో ఢిల్లీ మూడో స్థానంలో ఉందని సర్వేలో తేలింది. చాలా వరకు గృహహింస కేసులు వరకట్న వేధింపులతో ముడిపడి ఉండడం ఆందోళనకరం. ఈ సమస్యను పరిష్కరించడానికి, ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మరియు మహిళలపై నేరాలు, ముఖ్యంగా వరకట్నంపై అవగాహన పెంచాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీనియర్ అధ్యాపకుడు శ్రీనివాస్ మాధవ్ వరకట్న వ్యతిరేక కేరళ విధానాన్ని అధ్యయనం చేశారు. రెండేళ్ల కిందట కేరళ లో వరకట్న నిరోధక విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు కనిపిస్తోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఇదే విధానాన్ని అమలు చేసేలా చర్యలు చేపట్టడానికి రాష్ట్ర మహిళా కమిషన్‌కు ప్రతిపాదన సమర్పించారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదన మరియు అవసరమైన ప్రోటోకాల్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ విషయంపై అధికారికంగా ప్రకటించేందుకు ఉన్నత విద్యామండలి, మహిళా శిశు సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించాలని కూడా అధికారులు ఆలోచిస్తున్నారు.
ఇది కూడా చదవండి
Share your comments