News

రైతులకు శుభవార్త: PM కిసాన్ ఆప్ లో ఫేస్ ఆథెన్టికేషన్! ఇకపై ఈ ఇబ్బందులు ఉండవు

Sriya Patnala
Sriya Patnala
Know How Face authentication feature in PM Kisan app solves farmers problems
Know How Face authentication feature in PM Kisan app solves farmers problems

మోడీ ప్రభుత్వం PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన రూపంలో దేశం లోని రైతులందరికీ ప్రతి సంవత్సరం కనీస మద్దతు ఆర్ధిక సాయాన్ని అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఈ పథకంలో ప్రతి రైతుకు రూ. మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి 6000, నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు పంపబడతాయి. దాదాపు 8 కోట్ల మంది అర్హులైన లక్షలాది రైతులకు ఇప్పటిదాకా ప్రభుత్వం రూ.16,000 కోట్లు పంపిణీ చేసింది.ఈ స్కీమ్‌ ద్వారా అర్హత కలిగిన వారందరికీ సులువుగా లబ్ధి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఈ నేపథ్యంలోనే పీఎం-కిసాన్ యాప్‌లో ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ను విడుదల చేసింది.ప్రభుత్వ పథకాలలో ఫేస్‌ అథెంటికేషన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్న మొదటి కేంద్ర సంక్షేమ కార్యక్రమంగా పీఎం కిసాన్‌ నిలిచింది.

ఇది కూడా చదవండి

బ్యాంక్‌ ఖాతాలో బ్యాలెన్స్‌ రూ.30వేలు దాటితే అకౌంట్ క్లోజ్‌! ఈ వార్త నిజమేనా?

ఇప్పుడు లబ్ధిదారులైన రైతులు పీఎం కిసాన్, తమ మొబైల్ డివైజ్‌లలో ముఖాలను స్కాన్ చేయడం ద్వారా ఈజీగా e-KYC ప్రాసెస్‌ని కంప్లీట్‌ చేసుకోవచ్చు.ముఖ్యంగా వృద్ధులకు ప్రాసెస్‌ను సులభతరం చేసే లక్ష్యంతో ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు భోగట్టా.ఇక ఈ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ ఎలా పని పనిచేస్తుందంటే రైతులు తమ మొబైల్ ఫోన్లలో ఫేషియల్ స్కానింగ్‌ సాయంతో ఇ-కేవైసీ ప్రాసెస్‌ కంప్లీట్‌ చేయవచ్చు.మొబైల్ నంబర్లను తమ ఆధార్ కార్డ్‌లకు లింక్ చేయని వృద్ధ రైతులకు ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

లబ్ధిదారులందరికీ యాక్సెసబిలిటీ, కన్వీనియన్స్‌ అందిస్తుంది.గతంలో PM-కిసాన్ లబ్ధిదారులు బయోమెట్రిక్ వెరిఫికేషన్‌( Biometric Verification ) లేదా వారి రిజిస్డర్డ్‌ మొబైల్ నంబర్లకు పంపిన వన్-టైమ్ పాస్‌వర్డ్‌ ద్వారా e-KYC చేయించుకోవాల్సి ఉండేది.ఆధార్‌తో లింక్‌ కాని మొబైల్‌ నంబర్లు, వెరిఫికేషన్‌ సెంటర్లకు చేరుకోవడంలో ఇబ్బందులు రైతులకు సమస్యగా ఉండేది.ఇపుడు ఈ ఫేషియల్‌ అథెంటికేషన్‌ ఇలాంటి అడ్డంకులను తొలగించనుంది.

ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్ రైతుల ఆధార్ కార్డుల నుంచి ఐరిస్ డేటాను ఉపయోగించుకుంటుంది.ఇకపోతే పీఎం-కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్‌ ఫీచర్ గురించి ఇంకా ఎవరికీ తెలియకపోతే దానిని మీ దగ్గర వున్న రైతులకు సవివరంగా తెలియజేయండి.

ఇది కూడా చదవండి

బ్యాంక్‌ ఖాతాలో బ్యాలెన్స్‌ రూ.30వేలు దాటితే అకౌంట్ క్లోజ్‌! ఈ వార్త నిజమేనా?

Share your comments

Subscribe Magazine

More on News

More