News

మళ్ళీ పాల ధరల పెంపు – గేదె పాలు పెరిగినా, ఆవు పాలు తగ్గాయి!

Sandilya Sharma
Sandilya Sharma
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన పాల ధరలు -Telangana milk price hike (Image Courtesy: Google Ai)
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన పాల ధరలు -Telangana milk price hike (Image Courtesy: Google Ai)

తాజాగా పెరుగుతున్న పాల రేట్లు చూసి భాదపడాలో ఆనంద పడాలో తెలుసుకోలేని పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఒక వైపు పెరుగుతున్న పాల ధరలు తెలుగురాష్ట్రాల్లో పాడి రైతులకి మంచి చేస్తున్నా, మరోవైపు సామాన్యుడిని ఖర్చుల ఊబిలోకి తోసేస్తోంది (consumer milk burden). కొన్ని రోజుల కిందే మదర్ డైరీ ధరలు పెంచిన నేపథ్యంలోనే ప్రస్తుతం, తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య విజయ డెయిరీ(Vijaya Dairy) తాజాగా పాల ధరల సవరణపై కీలక నిర్ణయం తీసుకుంది. 

పాడి పరిశ్రమ ధర మార్పులు

    • ఈ ధరల పెపు ప్రకారం, గేదె పాల ధరలు పెరగగా, ఆవు పాల ధరలు తగ్గాయి. ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త ధరల ప్రకారం, 7% వెన్న శాతం ఉన్న గేదె పాల ధర లీటరుకు రూ.56 నుంచి రూ.59.50కి పెంచగా, 10% వెన్న శాతం ఉన్న గేదె పాల ధర రూ.80 నుంచి రూ.84.6కి పెరిగింది. అదే సమయంలో, 3% వెన్న శాతం ఉన్న ఆవు పాల ధర రూ.40 నుంచి రూ.36.50కి తగ్గింది.
    • విజయ డెయిరీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజూ 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరిస్తోంది. ఈ సేకరణ కోసం రైతులకు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతున్నాయి(Telangana buffalo milk price). 
    • మారిన కాలానికి అనుగుణంగా ధరల సవరణ అవసరమని భావించిన విజయ డెయిరీ, పాడిరైతుల లాభాలు పెంచేవిధంగా ఈ నిర్ణయం తీసుకుంది.
    • అయితే ఈ నిర్ణయం కేవలం విజయ డైరీది మాత్రమే కాదు, సంగం పాలు, నందిని పాలు, ఇలా చాలా పాల విక్రయసంస్థలు ధరలు భారీగా పెంచేస్తున్నారు. లెక్క ప్రకారం ఈ ధరలు ఇప్పటికే 20 నెలల్లో 9 రూపాయిల మీదే పెరిగాయి. 
Telangana buffalo milk price (Image Courtesy: Pexels)
Telangana buffalo milk price (Image Courtesy: Pexels)

ఈ పరిణామాలు సామాన్య ప్రజలకి చేదు వార్తనే అయినా, ఇందులో ఉన్న అవసరం అర్ధం చేసుకోవాలి. ప్రస్తుతం పాడిపరిశ్రమ కొద్దిగా నష్టాల్లో ఉంది. పాల ఉత్పత్తులకు సరయిన రాబడి రాక పాడి రైతులు (Dairy Farmers ) వాపోతున్నారు. వీరి భాధను గుర్తించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు పాల సంస్థలు చెబుతున్నాయి. అందుకే ఆంధ్ర (Andhra), తెలంగాణ(Telangana)లోని పాడి రైతుల(Dairy farmers)కు ఈ పెంపు  మరో భారీ గుడ్ న్యూస్ గా మారింది. 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డెయిరీ అయిన విజయ డెయిరీ(Vijaya Dairy) పాడి రైతులకు మేలు చేకూరేందుకే ఈ  కీలక నిర్ణయం తీసుకొని, పాల సేకరణ ధరలు (Telangana milk price hike) భారీగా పెంచుతున్నట్టు నిర్దేశకాలు జారీ చేసింది.

గేదె పాలు ధర 2025 (Vijaya Dairy new rates 2025) 

ఇది వరకు గేదె పాలల్లో 7 శాతం వెన్న ఉంటే లీటర్ కు రూ.56 ఇచ్చేవారు. దానిని ఇపుడు లీటర్ కు రూ.59.50కు పెంచింది. అలాగే 10 శాతం వెన్న ఉంటే ఇదివరకు లీటరుకు రూ.80 ఇస్తుండగా.. ఇకపై రూ.84.60 ఇవ్వనుంది. అయితే ఆవు పాల సేకరణ ధరలను మాత్రం స్వల్పంగా తగ్గించింది.ఇది వరకు 3 శాతం వెన్న కలిగిన లీటరు ఆవుపాలకు రూ.40 ఇస్తుండగా.. దానిని రూ.36.50 కు తగ్గించింది. 

పాల రకం

వెన్న శాతం

పాత ధర

కొత్త ధర

గేదె పాలు

7%

₹56.00

₹59.50

గేదె పాలు

10%

₹80.00

₹84.60

ఆవు పాలు

3%

₹40.00

₹36.50

 

ఆవు పాలు తగ్గింపు(Cow milk price decreased)

మొత్తంగా గేదె పాలు విక్రయించే రైతులకు భారీగా లబ్ది చేకూరగా.. ఆవుపాలు విక్రయించే రైతులు స్వల్పంగా నష్టపోనున్నారు. అయితే సవరించిన పాల ధరలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్టు సమాచారం. కానీ ఈ పాలకార్డు ఉన్నవాళ్ళకి మాత్రం ఈ రేట్లు ఏప్రిల్ 8 నుండి అమలు అవుతాయి. అయితే పాల సేకరణ ధరలు పెంచడం పట్ల పాడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

Share your comments

Subscribe Magazine

More on News

More