తరతరాలుగా భూమిని నమ్ముకున్న రైతులను నేలతల్లి మోసంచేయడంలేదు.కానీ, అవినీతితతో నిండిన కొన్ని వ్యవస్థల నిర్లక్ష్యపు ధోరణే రైతులను మోసం చేస్తుందని చెప్పడం హాస్యాస్పదమేమికాదు..రెండు తెలుగు రాష్టాలలోని రైతులకు సాగు కష్టాలు మొదలైయ్యాయి.ప్రపంచం మొత్తన్ని కరోనా మహమ్మారి చుట్టుముట్టినా..రైతులు మాత్రం తమ కష్టాలను కళ్ళలోనే దాచుకొని ప్రపంచానికి ఆహారాన్ని అందించే పనిలో మునిగిపోయారు.దీనిలో భాగంగానే..విత్తనాలను నాటే సమయంలో రైతులను నకిలి, నాసిరకం విత్తనాలు పలకరిస్తున్నాయి. హెచ్ టీ పత్తి విత్తనాలను, సాధారణ బీటీ విత్తనాలపేరుతో వ్యాపారులు స్వేచ్ఛగా అమ్ముతూ..రైతులను మోసం చేస్తున్నారు. అధికారులు అక్కడక్కడా దాడులు చేసి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ..ఈ నకిలి విత్తనాల వ్యాపారం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో రైతులు సంయమనం పాటించి, మేలైన విత్తన రకాలను ఎంచు కోవాలని హైదరాబాద్ లోని భారతీయ వరి పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఏ వి యస్ ఆర్. స్వామి, సుబ్బారావు, గోవర్థన్ లు తెలిపారు.
జాతీయ విత్తనోత్పత్తి పద్దతి ద్వారా గిరిజన రైతులకు ఇంఫ్రూట్ సాంబా మసూరి విత్తనాలను అందించారు.ఈ రకమైన విత్తనాలు ఎండాకు తెగుళ్ళను తట్టుకుని 135 నుంచి 140 రోజులలో పంటను అందిస్తారని పేర్కొన్నారు.
Share your comments