News

బీహార్ ని చూసి నేర్చుకోవాలి! ఈ పంట ఖచ్చితంగా వెయ్యాలి… కలెక్టర్ త్రిపాఠి

Sandilya Sharma
Sandilya Sharma

సోమవారం కలెక్టరేట్​లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ఐలా త్రిపాఠి పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మీటింగ్ లో మాట్లాడుతూ, పంట మార్పిడిపై వచ్చే వ్యవసాయ సీజన్ కు ముందే రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఒక్కో  డివిజన్ లో సదస్సులు నిర్వహించి రైతులకి సహాయసహకారాలు అందించాలని వివరించారు.

పంటమార్పిడి తోనే భవిషత్తు 

ప్రస్తుతం జిల్లాలోని ఎక్కవ శాతం రైతులు వరి పండిస్తున్నందున ఎండాకాలం సాగునీరు సరిపోక నీటి కష్టాలు భరించాలిసి వస్తుందని అన్నారు. వేడి ఎక్కువ ఉండే సరికి నీళ్లు సరిపోక, భూగర్భ జలాలు వాడేయడం మూలాన పంటలకు తీవ్ర,ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పారు.  అదే ఆరుతడి, ఉద్యాన పంటలు సాగుచేస్తే తక్కువ నీరుతో  అవసరం అవుతుందని, ఇవన్నీ ఆలోచించి  రైతులకు పంట మార్పిడి గురించి అవగాహన కల్పించాల్సిన ప్రాముఖ్యత  ఉందని అన్నారు.

మఖాన సాగుతో ఆదాయం 

బిహార్ రాష్ట్రంలో ఎక్కువగా వ్యవసాయదారులు  'మఖాన' పంటను పండిస్తున్నారని, అదేవిధంగా తెలంగాణ రైతులు కూడా ఈ పంటను పండిస్తే లాభసాటిగా ఉంటుందని, అలానే ఈ వైపుగా రైతులని ప్రోత్సహించే భాద్యత శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మీద ఉందని అన్నారు. 

ఇంకా మాట్లాడుతూ మఖానలో క్యాల్షియం ఎక్కువగా ఉండడంవల్ల, ఎముకలు బలపడతాయని, అదీకాక గ్లోబల్ మార్కెట్‌లో మఖానాకు మంచి ధర పలుకుతుందని తెలిపారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని  పైలెట్ పద్దతిలో అన్ని జిల్లాల్లో మఖానా పండించేందుకు, ముందుగా నల్ల‌గొండ‌, కట్టంగూరు, తిప్పర్తి, కొండమల్లేపల్లి, చందంపేట లాంటి ప్రదేశాల్లో మఖాన ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేయాలని, అందుకు తగిన చర్యలు సత్వరమే తీసుకోబోతున్నామని పేర్కొన్నారు. ఇందుమూలంగానే , వీటి సాగుపై జిల్లా నుండి శాస్త్రవేత్తలను, వ్యవసాయ అధికారులను బీహార్ కు పరిశోధన నిమిత్తం పంపించామని చెప్పారు.

ప్రస్తుతం వ్యవసాయ, హర్టికల్చర్ విశ్వవిద్యాలయంలో మఖాన మీద అధ్యనాలు చేపట్టినట్టు, అలానే త్వరలోనే, దీనిపై రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం జరగబోతుందని వెల్లడించారు. దీనివల్ల ప్రజలకు మఖానతో పోషకాలు లభించడమే కాక, రైతులకు ఎంతో రాబడి పెరుగుతుందని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ మఖాన పంట సాగు పద్దతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బీహార్ రాష్ట్రంలో “మఖాన” పంటను అధిక మొత్తంలో పండిస్తున్నారని, ఈ పంట వల్ల లాభం ఎక్కువగా వస్తుందని, జిల్లా రైతులు ఈ పంటను సాగు చేసే విధంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ప్రోత్సహించాలని కోరారు.ఈ విషయంపై వ్యవసాయ అధికారులు దృష్టి సారించి, ఎన్నుకున్న మండలాలలో నోడల్ అధికారులుగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

చివరగా మున్సిపాలిటీలు, గ్రామాలలో తాగునీటి కొరత లేకుండా, తగు చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ తాగునీటిని వేరే పనులకి వాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా దొరికితే, వెంటనే జరిమానా విధిస్తామని కలెక్టర్ తెలిపారు.

 

Share your comments

Subscribe Magazine

More on News

More