16 మే - జాతీయ డెంగ్యూ దినోత్సవం : గత కొన్ని సంవత్సరాలుగా ,లక్షల్లో డెంగ్యూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి, అంతెందుకు 2021 లోనే 2.15 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ప్రజల్లో డెంగ్యూ గురించి అవగాహనా కల్పించడానికి గాను, ప్రతి సంవత్సరం మే 16 వ తేదీని డెంగ్యూ దినోత్సవం జరుపుతూ ఉంటాము.
అసలు డెంగ్యూ అంటే ఏమిటి?
డెంగ్యూ జ్వరం అనేది ఒక వైరల్ వ్యాధి, దోమ కాటు ద్వారా ,డెంగ్యూ వైరస్ (DENV) మనిషికి సోకుతుంది . ప్రపంచ జనాభాలో దాదాపు 4 బిలియన్ల మంది ప్రజలు డెంగ్యూ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
డెంగ్యూ నాలుగు విభిన్న వైరస్‌ల వల్ల వస్తుంది.ఇది ఆడ ఏడిస్ దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది, ఇవే దోమలు పసుపు జ్వరం, జికా వైరస్‌లు మరియు చికున్‌గున్యాలను కూడా వ్యాపిస్తాయి. ఈ దోమ పగటిపూట కుడుతుంది. దోమ కాటు తర్వాత 3-14 రోజులకు రోగి లో లక్షణాలు కనిపిస్తాయి .
లక్షణాలు:
కీళ్ల లేదా కండరాల నొప్పి, తలనొప్పి, వికారం, గ్రంథులు వాపు, వాంతులు, దద్దుర్లు కొన్ని సాధారణ లక్షణాలు. కొన్ని సందర్భాల్లో లక్షణాలు తీవ్రమయ్యి , ప్రాణాంతకమవుతాయి, రోగ నిరోధక శక్తీ బాగానే ఉంటె 4-7 రోజుల ఉండే లక్షణాల తర్వాత సరైన చికిత్స తీసుకుంటే సాధారణంగా ఒక వారంలో కోలుకోవచ్చు .సాధారణ ఫ్లూ, వైరల్ జ్వరాలు తో పొరబడకుండా సరైన సమయం లో చికిత్స తీస్కోడం చాల ముఖ్యం.
ఇది కూడా చదవండి
రేషన్ కార్డు లబ్దిదారులకు చివరి అవకాశం: రేషన్ - ఆధార్ లింక్ చేయకుంటే కార్డు కట్ !
చికిత్స:
డెంగ్యూ జ్వరానికి నిర్దిష్ట చికిత్స లేదు కానీ దాని లక్షణాలను పారాసెటమాల్ లేదా ఎసిటమినోఫెన్‌తో చికిత్స చేయవచ్చు. తేలికపాటి డెంగ్యూ జ్వరాన్ని నయం చేయడానికి నోటి ద్వారా మందులు ఇస్తారు. ఒకవేళ తీవ్రమైతే , ఇంట్రావీనస్ (IV) ద్రవం మరియు ఎలక్ట్రోలైట్‌లతో ఆసుపత్రిలో చికిత్స ఇవ్వబడుతుంది.బాగా తీవ్రమైన సందర్భాల్లో, రక్త నష్టాన్ని భర్తీ చేయడానికి రక్తమార్పిడి చేయబడుతుంది. 9-45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు, కనీసం ఒక్కసారి డెంగ్యూ జ్వరం వచ్చిన వారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.
నివారణ
డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించడంలో నివారణ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాధిని ఎదుర్కోవడానికి, పరిసరాలు శుభ్రత , పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడడం, దోమలను నివారించడం చాలా ముఖ్యం.
తలుపులు మరియు కిటికీలు మూసి ఉంచడం లేదా కీటకాల తెరలను అమర్చడం ద్వారా దోమలు ఇళ్లలోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చు. ఆరుబయట ఉన్నప్పుడు దోమల వికర్షకాలను ఉపయోగించడం, నిండా దుస్తులు ధరించడం మరియు నిద్రిస్తున్నప్పుడు దోమ తెరలను ఉపయోగించడం దోమల కాటును తగ్గించడానికి కొన్ని చర్యలు. డెంగ్యూ జ్వరాన్ని ముందస్తుగా గుర్తించడానికి ,సరైన వైద్యం తీస్కోవదానికి , డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాల గురించి అవగాహన ఉండడం చాలా అవసరం.
ఇది కూడా చదవండి
Share your comments