News

NMNF పథకంతో మారనున్న ప్రకృతి సేద్యం

Sandilya Sharma
Sandilya Sharma
Image Courtesy: Gemini AI
Image Courtesy: Gemini AI

దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులను ప్రకృతి సేద్యం దిశగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (NMNF) పథకాన్ని అమలు చేయనున్నది. 2024 నవంబర్ 25న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన ఈ పథకానికి ప్రస్తుతం 2481 కోట్ల నిధులను కేటాయించింది.

పథకానికి ఆమోదం - మారుతున్న వ్యవసాయ విధానం

  • హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర,రాష్ట్ర నిధుల వాటా 90:10,
  • మిగతా రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో నిధుల కేటాయింపు.

  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 177.78 లక్షలు విడుదల.

రైతులకు శిక్షణ - సహకార హస్తం

ఈ పథకం కింద ప్రతి రాష్ట్రంలో ప్రకృతి సేద్యపు కేంద్రాలు CoNF ఏర్పాటు చేయబడి రైతులకు శిక్షణ ఇస్తున్నారు.

  • 70,021 మంది రైతులు మట్టి ఆరోగ్యం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై శిక్షణ పొందారు.

  • ప్రకృతి సేద్యం మోడల్ ఫార్ముల అభివృద్ధికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

పర్యావరణహిత వ్యవసాయం 

NMNF అమలుతో వ్యయ నియంత్రణతోపాటు పర్యావరణ హితం కలిగిన వ్యవసాయ పద్ధతులు రైతులకు అందుబాటులోకి రానున్నాయి.
ఈ పథకంతో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు, ప్రకృతి వ్యవసాయంపై దేశవ్యాప్తంగా అవగాహన పెరుగనుంది.

Share your comments

Subscribe Magazine