News

నంధ్యాలలో ఇక బస్తాకి రూ.4, డ్రోన్లకి రుణాలు, కొత్త నిర్దేశకాలు

Sandilya Sharma
Sandilya Sharma
Andhra cooperative farming updates- Rajakumari collector agriculture news (Image Courtesy: Google Ai)
Andhra cooperative farming updates- Rajakumari collector agriculture news (Image Courtesy: Google Ai)

రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నంద్యాల జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు నూతన మార్గదర్శకాలను (PACCS guidelines Nandyal 2025) అమలు చేయనున్నాయి. జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా సహకార సమన్వయ అభివృద్ధి కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కంప్యూటరీకరణ పూర్తికి లక్ష్యతీర్మానం (PACCS modernization)

కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, జిల్లాలోని 56 PACCSలలో 51 సంఘాల్లో కంప్యూటరీకరణ ఇప్పటికే పూర్తయిందని, మిగిలిన 5 సంఘాల్లో వారం రోజులలోపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కంప్యూటరీకరణ ద్వారా రైతులకు తక్షణ సేవలు అందించడం సులభమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

బస్తాకు రూ.4 రుసుం (₹4 per bag storage policy)

రైతులు తమ పంట ఉత్పత్తులను భద్రంగా నిల్వ చేసుకునే అవకాశం కల్పించేందుకు బస్తా ఒక్కింటికి రూ.4 చొప్పున రుసుం వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు (crop storage fee for farmers). ఈ రుసుం వ్యవస్థ ద్వారా రైతులకు భద్రపరిచే లాభం లభిస్తే, సహకార సంఘాలకు ఆర్థిక వనరులు కూడ కలుగుతాయన్నది అధికారుల అభిప్రాయం.

డ్రోన్లకు రుణాలు (agri drone loans AP)

వ్యవసాయంలో ఆధునికతకు దోహదపడేలా డ్రోన్ల కొనుగోలుకు రైతులకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డ్రోన్ల వినియోగం ద్వారా పంటలపై మందుల ప్రయోగం, భూమి అంచనాలు, పంట వృద్ధిపై సమాచారం సులభంగా పొందవచ్చునని ఆమె పేర్కొన్నారు. ఇది రైతులకు శ్రమను తగ్గించి, సమర్థతను పెంచే దిశగా కీలకమని వివరించారు.

సహకార రంగంతో సమన్వయం (Nandyal agriculture committee meeting)

ఈ సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి వెంకట సుబ్బయ్య, నాబార్డు అధికారి సుబ్బారెడ్డి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి గోవిందునాయక్, మత్స్యశాఖ అధికారి రాఘవ రెడ్డి, డీపీఓ షేక్ జమీవుల్లా తదితరులు పాల్గొన్నారు. వారు సంఘాల ఆధునికీకరణ, సాంకేతిక వనరుల వినియోగంపై సమాలోచనలు జరిపారు.

Read More:

రూ.1600 కోట్లతో కొత్త M-CADWM ఉపపథకం ప్రారంభం, రైతులకు మంచిదేనా ?

రూ.1,332 కోట్లతో ప్రాజెక్టుకు ఆమోదం….ఇది కొత్త వ్యవసాయ మార్గానికి నాంది…. చంద్రబాబు

Share your comments

Subscribe Magazine

More on News

More