
స్వర్ణాంధ్ర 2047 లో భాగంగా సామాజిక భద్రత పింఛన్లని తెలుగుదేశం పార్టీ అందచేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ భరోసా పథకం గురించి తాజగా ఒక అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ , ఏప్రిల్ పంపిణీ ప్రారంభమైనట్లు టీడీపీ శ్రేణులు వెల్లడించాయి.
- ఈ పింఛన్లు ఉదయం 7 గంటల నుంచి, సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తారని, ఉదయం10 గంటలకే దాదాపుగా 80% లబ్ధిదారులకు పింఛన్లు అందజేయడం జరిగిందని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు.
- అలానే ఈ నెల నుండి కొన్ని కొత్త మార్పులు కూడా రావడం జరిగింది. ఇకనుండి దివ్యాంగ విద్యార్థులు పింఛను కోసం ప్రతి నెలా ఊరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఏప్రిల్ 1 నుంచి డబ్బులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దివ్యాంగుల కోటాలో ప్రస్తుతం ఆరు వేల నుంచి 15 వేల రూపాయిల వరకు పింఛన్ అర్హులు ఈ పథకాన్ని అందుకుంటున్నారు.
- ఒకవేళ ఈ విధానం కింద పింఛన్లను నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి రావాలి అనుకుంటే విద్యార్థులు తమ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకొని స్టడీ సర్టిఫికేట్, బ్యాంకు ఖాతా వివరాలు, పింఛన్ ఐడీ, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సమర్పించాలని అధికారులు వివరించారు. దీని తర్వాత ఎంపీడీవో కార్యాలయం వీటిని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు పంపిస్తారు. అక్కడ నుంచి అన్ని ప్రక్రియ పూర్తిచేసుకొని, ప్రతి నెలా డీబీటీ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు జమ అవుతాయి.
ఇకపోతే ఏప్రిల్ 1 వ తేదీన మంగళవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం, చినగంజాం మండలం, పెద్దగంజాం గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పేదల సేవలో’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసి, అనంతరం ఏర్పాటు చేసే సభలో మాట్లాడతారు.
జూన్ 24 న మొదలైన ఈ పథకం ప్రకారం వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, ART (PLHIV) వ్యక్తులు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు, లింగమార్పిడి మరియు డప్పు కళాకారుల సామాజిక భద్రతా పెన్షన్లు అందించడానికి మొదలైంది. దీంట్లో మొత్తం వికలాంగుల నాలుగు వేలు. కుష్టు వ్యాధిగ్రస్తులకు ఆరు వేలు, ఇక పూర్తిగా వికలాంగులకు పది వేలు అందిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులు అంటే, చిన్న కాంట్రాక్ట్ మూత్రపిండ వ్యాధులు రూ. నెలకు 10 వేలు మరియు ప్రభుత్వ మరియు నెట్‌వర్క్ ఆసుపత్రులలో డయాలసిస్ చేయించుకుంటున్న దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు కూడా నెలకు పదివేలవరకు ప్రభుత్వం ఇస్తుంది. అయితే ప్రస్తుతం ఈ పథకంలో అనర్హుల ఏరివేత నత్త నడకన సాగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
Share your comments