మూడు వరాల ఆలస్యం అయ్యిన తరువాత ఎట్టకేలకు రుతుపవనాలు ప్రవేశించి , ఢిల్లీ, ఉత్తర భారతదేశంతో పాటు పశ్చిమ, దక్షిణ భారతదేశంలో కూడా విస్తరించాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఈ వర్షాలు మరీ ఎక్కువగానే కురుస్తున్నాయి . వానాకాలం లో ఆగకుండా కురుస్తున్న వర్షం ప్రభావంతో ప్రస్తుతం కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి.
తెలంగాణ , కర్ణాటక మొదలయిన పలు ప్రాంతాల్లో టమాటా ధర ఆకాశాన్నంటుతుంది . కిలో ధర ఏకంగా రూ.100 దాటింది.మిర్చి 200 రూ. , అసలు ఏ కూరగాయలు కిలో రూ.50కి తగ్గడం లేదు. కూరగాయల ధరలు పెరిగదానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండా వేడికి పంటలు దెబ్బతినడం, సకాలంలో వర్షాలు కురవకపోవడంతో కూరగాయలు అంత ఎక్కువగా సాగు చేయకపోవడంతో దిగుబడి తగ్గిపోయింది.దీనితో ధరలు పెరిగిపోయాయి.
టమాటా బాటలోనే ఉల్లిపాయలు కూడా పయనిస్తున్నాయి. రానున్న ఒకటిన్నర, రెండు నెలల్లో ఉల్లిపాయల ధరలు కూడా వంద దాటిపోయే అవకాశం ఉంది. అంటే ఉల్లి ధర కూడా కిలోకు రూ. 100 లేదా అంతకు మించి ఉంటుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతినే అవకాశం ఉంది. దీని ప్రభావం రాబోయే రోజుల్లో టోకు, రిటైల్ ధరలపై చూడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లి వ్యాపారుల నిల్వ కూడా ఇప్పటి నుంచే మొదలైంది
ఇది కూడా చదవండి
Share your comments