News

ఇకపై దేవుడికి ‘కల్తీ ప్రసాదం’ నిషేధం! కలెక్టర్‌ సంచలన నిర్ణయం

Sandilya Sharma
Sandilya Sharma
Natural farming promotion Telangana- Collector Vijayakrishnan orders- Devotional farming policy TG (Image Courtesy: Google Ai)
Natural farming promotion Telangana- Collector Vijayakrishnan orders- Devotional farming policy TG (Image Courtesy: Google Ai)

జిల్లాలోని అన్ని దేవాలయాల్లో నైవేద్యంగా సమర్పించే ఆహార పదార్థాలు ఇకపై కేవలం ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఉత్పత్తులే (natural farming in temples) కావాలని కలెక్టర్ డాక్టర్ ఎ. విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు(collector Vijayakrishnan temple directive). దేవదాయశాఖ, వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి సంబంధిత వివరాలు సమీక్షించారు.

ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వ ప్రోత్సాహం

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘‘భూమిని రసాయనాల వల్ల నాశనం చేయడం మంచిది కాదు. రసాయనాలతో పండిన పంటలను దేవుడికి సమర్పించడం నైతికంగా కూడా సమంజసం కాదు. కాబట్టి ప్రతి దేవాలయంలో నైవేద్యం, ప్రసాదాలకు ఉపయోగించే పదార్థాలు ప్రకృతి సాగులో పండించినవే కావాలి (prasadam with organic produce)’’ అని అన్నారు.

 కొత్త నిర్దేశకాలు (Devasthanam Naivedyam rules)

  • ప్రతి దేవాలయానికి సరఫరా చేసే ప్రకృతి రైతు సంఘాన్ని మ్యాపింగ్ చేయాలని,
  • 100 శాతం ప్రకృతి సాగులో పండిన ఉత్పత్తులనే వినియోగించేలా చూడాలని,

  • ఈ చర్యలపై వ్యవసాయ శాఖ పర్యవేక్షణను పెంచాలని అధికారులను ఆదేశించారు.

మార్కెట్, సరఫరా ప్రణాళిక

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు మార్కెట్ లభ్యత కల్పించడంపై కలెక్టర్ దృష్టి సారించారు. రైతులు ప్రకృతి సాగు చేస్తే ఆదాయం వచ్చేది ఎలా? ఎక్కడ అమ్ముకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానంగా, ఆలయాల నైవేద్య అవసరాలను ప్రాధమికంగా ఉపయోగించుకోవాలని సూచించారు (temple food policy). దేవదాయశాఖ అధికారులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు అధికారి సిహెచ్. లచ్చన్న, జిల్లా వ్యవసాయ అధికారి బి. మోహనరావు, దేవదాయశాఖ అధికారి కె.ఎల్. సుధారాణి, వివిధ ఆలయాల ఎగ్జిక్యూటివ్ అధికారులు పాల్గొన్నారు.

భవిష్యత్తు దిశ

ఈ నిర్ణయం అమలుతో దేవాలయాలకు స్వచ్ఛమైన, రసాయన రహిత నైవేద్య పదార్థాలు (temple organic produce Telangana) అందిస్తారు. ఇది ఒకవైపు భక్తుల ఆరోగ్యాన్ని కాపాడుతుందనగా, మరోవైపు ప్రకృతి సాగును ప్రోత్సహించే మైలురాయిగా నిలుస్తుంది. భక్తి, భూమి రెండింటికీ మేలు చేసే విధంగా ఈ చొరవను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు (organic naivedyam initiative).

Read More:

పత్తి సేకరణలో తెలంగాణ అగ్రస్థానం… కేంద్ర గణాంకాల్లో తెలంగాణ ఘన విజయం!

తెలంగాణలో వారం రోజులపాటు వర్షాలు? వాతావరణ శాఖ అంచనా ఇదేనా?

Share your comments

Subscribe Magazine

More on News

More