2,000 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో కాష్ చెల్లింపులు 90 శాతం పెరిగాయి
ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం, ఆర్‌బిఐ శుక్రవారం ప్రకటనకు ముందు,2000 నోట్లు కేవలం 10 శాతం ఉండేవి , ఇప్పుడు బంకులలో నగదు లావాదేవీలలో రూ. 2,000 నోట్ల వాటా 90 శాతానికి పెరిగింది. పెట్రోల్,బంకుల మొత్తం విక్రయాల్లో 40 శాతం ఉండే డిజిటల్ చెల్లింపులు 10 శాతానికి తగ్గిపోయాయి.
కస్టమర్లు రూ. 100-200 చిన్న కొనుగోళ్లకు కూడా రూ. 2,000 నోట్లను ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారు , దీని వళ్ళ మా వద్ద కాష్ కొరత నెలకొంటుందని అసోసియేషన్ తెలిపింది. బంకుల వద్ద సజావుగా కార్యకలాపాలు సాగించేందుకు రూ.2,000 నోట్లకు బదులుగా చిన్న డినామినేషన్‌లలోని నోట్లను తగినన్నీ అందించాలని అసోసియేషన్ ఆర్‌బీఐని కోరింది.
ఇది కూడా చదవండి
నేటి నుండే బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల మార్పిడి ప్రారంభం: పూర్తి వివరాలు చూడండి
2016 పరిస్ధితి మల్లి కనపడుతుంది
RBI "2016 డీమోనిటైజేషన్ సమయంలో ఎదుర్కొన్న అదే క్లిష్ట పరిస్థితిని దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల వద్ద మళ్లీ కనపడుతుందని అని అసోసియేషన్ పేర్కొంది . కస్టమర్లు భారిగా 2000 నోట్లు మార్చడానికి ప్రయత్నిస్తూడడం తో బంకు ఓనర్ లకు ఐటి నోటీసులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు.
డిజిటల్ ప్రెమెంట్స్ లేదా సరైన డినామినేషన్ ఉన్న నోట్ల తో చెల్లించామని కస్టమర్లను కోరుతున్నారు బంకు ఓనర్లు
సెప్టెంబర్ 30 వరకు 2000 నోటు చట్టబద్ధంగా కొనసాగుతుందని ఆర్‌బిఐ హామీ ఇచ్చినప్పటికీ, రూ. 2,000 నోట్లలో చేసిన చెల్లింపులను అంగీకరించరెమో అనే ఆందోళనలు ప్రజల్లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి
Share your comments