పంజాబ్ గురుదాస్ పూర్ లో ప్రభుత్వ భూ సేకరణకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఒక మహిళా రైతు పై,పొలిసు అధికారి చేయ చేసుకున్న వీడియో మీడియా లో వైరల్ అవుతుంది.
పంజాబ్ లో భారతమాల ప్రాజెక్టు కోసం నష్టపరిహారం ఇవ్వకుండానే , రైతులనుండి భూమిని సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు.
కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ అధ్యక్షుడు సర్వన్ సింగ్ పంధేర్ చెప్పిన వివరాల ప్రకారం , ఢిల్లీ -కాట్రా హైవే పై గురువారం జరిగిన నిరసన లో ఒక మహిళా రైతును, పొలిసు అధికారి చెంప పై కొట్టిన వీడియొ వెలుగులోకి వచ్చింది. నిరాశన ను అడ్డుకోడానికి , గురుదాస్ పూర్ , భంబ్రీ గ్రామం మొత్తం పెద్ద ఎత్హున పొలిసులు చేరుకోవడం జరిగింది. ఈ నిరసన ను అడ్డుకోనే ప్రయత్నంలో పంజాబ్ పోలీసులు రైతులపై బల ప్రయోగం చేయడం జరిగింది. నిరసన లో ఒక వ్యక్తి తలపాగా ను తీసి పడేయడం, ఆడవాళ్ళ తో దుర్భాషలాడడం వంటి ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి.
రైతులకు పరిహారం చెల్లించే వరకు భూమిని సేకరించేది లేదని ప్రభుత్వం రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పంధేర్ తెలిపారు. “ప్రభుత్వం ఆగస్టు వరకు సమయం కోరింది, కానీ జలంధర్ ఉప ఎన్నికల విజయం తర్వాత, ప్రభుత్వం పంజాబ్‌ను తేలికగా తీసుకుంటోంది. ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు పంజాబ్ మీదుగా రైల్వే లైన్లను దిగ్బంధిస్తాం' అని తెలిపారు.
గత నెలలో, గురుదాస్‌పూర్‌లోని రైతులు హైవేల నిర్మాణానికి సంబంధించిన భరత్‌మాల ప్రాజెక్ట్ కోసం భూమిని సేకరించడాన్ని నిరసిస్తూ రైళ్లను బ్లాక్ చేయడం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. రైతులు తమ ట్రాక్టర్లను రైలు పట్టాలపై నిలిపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా యంత్రాంగం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రభుత్వం భూ సేకరను ఆపి వేయకపోతే నిరసనలు ఆపేదే లేదని వారు తెలిపారు.
Share your comments