ప్రభుత్వం చెప్పిన రకం పంటల నే సాగు చేయాలని వారీకే రైతు బంధు పథకం వర్తిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. ఆ పంటలనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆదేశించింది.
ఈ వర్షాకాలం సీజన్లో వరి పంటతో నియంత్రిత పద్ధతిలో పంటలసాగు విధానాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలో ఈ సీజన్లో 50 లక్షల ఎకరాలలో వరిని సాగు చేయాలని ఇందులో సన్నా, దొడ్డు రకాలను తప్పకుండా పండించాలని స్పస్టం చేశారు.
రైతులు ఏ వరి రకాన్ని ఎంత విస్తీర్ణంలో పండించాలో త్వరలోనే ప్రభుత్వం వెల్లడిస్తుంది అన్నారు.
ఈ వర్షాకాలంలో 50 లక్షల ఎకరాలలో పత్తి, 10లక్షల ఎకరాల్లో కందులు పండించాలని, పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలలో కూరగాయల సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, సీఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో పంటల మార్పిడి, పంటల కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష వహించారు. దీనిలో మంత్రి ఈటల రాజేందర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేష్ కుమార్, ముఖ్య కార్యదర్శులు ఎస్ . నరసింహారావు బి. జనార్దన్ రెడ్డి, రామకృష్ణారావు, వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి ప్రవీణ్ రావు, ఉద్యాన సంచాలకుడు వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
" రైతులు సాగుకు సంబంధించి చర్చించేందుకు క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడుతాను. అమ్మబోతే అడవి కొనబోతే కొరవి అనే నానుడి ఎప్పటినుంచో ఉంది. పండించిన పంట అమ్ముదాం అంటే అమ్ముడు పోదు కావలసిన వస్తువులు కొందామంటే ధరలు ఉంటాయి. ఇందుకు కారణం అందరూ ఒకే రకమైన పటలు పండించడం. అందుకే ఒకే పంట వేసే విధానం పోవాలి. అంగట్లో సరుకు పోసి ఆగం కావద్దు. రైతులు ఏ పంట వేస్తే లాభపడతారో ప్రభుత్వమే చెబుతోంది. ఆ పంటలకు మద్దతు ధర ప్రభుత్వమే కల్పిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన పంటలని సాగు చేయాలని నిర్ణయించినందున ఇకపై విత్తనాలు ఆ పంటలకు సంబంధించినవి మాత్రమే రాయితీపై అమ్మాలని, దీనిపై విత్తన తయారీ సంస్థలకు, వ్యాపారులకు ఆదేశాలు ఇస్తాం. ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే లభ్యమయ్యేలా మండలి చర్యలు ఉంటుంది. అవసరమైతే విత్తన చట్టం లో మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెద్ద ఎత్తున వరి పండుతుంది అందుకే రైసుమిల్లుల సామర్థ్యం బాగా పెరగాలి. త్వరలో మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధులతో సమావేశం అవుతా"
అని సీఎం కెసిఆర్ స్పష్టం చేశారు.
సీఎం తీసుకున్న నిర్ణయాలు ఇవే
రాష్ట్ర విత్తన నియంత్రణ మండలి ఏర్పాటు
విత్తన కంపెనీల ప్రతినిధులతో సమావేశం, నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. నకిలీ విక్రేతల పై పిడి చట్టం కింద కేసు నమోదుచేయాలి. సమగ్రవ్యవసాయ విధానానికి అనుగుణంగా వ్యవసాయశాఖను పునర్వ్యవస్థీకరించారు
వ్యవసాయ వర్సిటీల్లో రాష్టంలో సాగు చేయాల్సిన పంటలపరిశోధనలు జరగాలి .
Share your comments